నకిలీ documentsతో ఇల్లు కబ్జాకు యత్నం

ABN , First Publish Date - 2021-12-01T16:26:15+05:30 IST

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటిని కబ్జా చేయడానికి యత్నించిన, మహిళా న్యాయవాదిని బెదిరించిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన

నకిలీ documentsతో ఇల్లు కబ్జాకు యత్నం

న్యాయవాదిని బెదిరించిన వ్యక్తి అరెస్టు

హైదరాబాద్/పంజాగుట్ట: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటిని కబ్జా చేయడానికి యత్నించిన, మహిళా న్యాయవాదిని బెదిరించిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన న్యాయవాది కనకదుర్గ 2017 సంవత్సరంలో కొండల్‌రావు అనే వ్యక్తి వద్ద 96 గజాల్లో ఉన్న ఇంటిని కొనుగోలు చేసి అందులో నివసిస్తున్నారు. ఎర్రగడ్డ నటరాజ్‌నగర్‌కు చెందిన రమే్‌ష(50)ఆ ఇంటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. నోటరీ సహాయంతో తన పేరుతో విద్యుత్‌, మంచినీటి కనెక్షన్లు తీసుకున్నాడు. ఒకే ఇంటిపై రెండు విద్యుత్‌ మీటర్లు ఉండడంతో కనకదుర్గకు అనుమానం వచ్చింది. వివరాలు తెలుసుకోగా రమేష్‌ అనే వ్యక్తి నకిలీ పత్రాలతో తీసుకున్నట్లు తెలిసింది. అతడిని ఆమె నిలదీయగా.. కొండల్‌రావు ఇంటిని తనకు నోటరీ చేశాడని చెప్పి న్యాయవాదిని బెదిరించాడు. దీంతో ఆమె తన వద్ద ఉన్న డాక్యుమెంట్లతో పోలీసులకు నవంబర్‌ 11న ఫిర్యాదు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడమే కాకుండా న్యాయవాదిని బెదించిన రమే్‌షను మంగళవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-12-01T16:26:15+05:30 IST