కొవిడ్‌ ఆస్పత్రుల్లో సమయ పాలన పాటించని డాక్టర్లు

ABN , First Publish Date - 2021-05-17T05:38:05+05:30 IST

కొవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణ ఇష్టారాజ్యం సాగుతోంది. కరోనా అంటువ్యాధి కావడంతో లోపలికి అందరూ వెళ్లడానికి అవకాశం లేదు. పర్యవేక్షణ అధికారులు సైతం భయం..భయంగానే ఆ కొవి డ్‌ కేంద్రాలకు వెళ్తుంటారు.

కొవిడ్‌ ఆస్పత్రుల్లో సమయ పాలన పాటించని డాక్టర్లు

నర్సులు, ఎంఎన్‌ఓలపైనే భారం

బెడ్లు అమ్ముకుంటున్న సిబ్బంది

నోరు మెదపని నోడల్‌ అధికారులు

పీడీ సుబ్బరాయుడు విషయంలో తేటతెల్లం

ఇతర అధికారుల కుటుంబాలలో అలజడి


అనంతపురం వైద్యం, మే 16 : కొవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణ ఇష్టారాజ్యం సాగుతోంది. కరోనా అంటువ్యాధి  కావడంతో లోపలికి అందరూ వెళ్లడానికి అవకాశం లేదు. పర్యవేక్షణ అధికారులు సైతం భయం..భయంగానే ఆ కొవి డ్‌ కేంద్రాలకు వెళ్తుంటారు. చుట్టుపు చూపుగా వెళ్లి అందు బాటులో ఉన్నవారితో మాట్లాడి వెనుదిరిగి వస్తున్నారు. దీంతో డాక్టర్లు సమయ పాలన పాటించడం లేదు. వారు ఇష్టమొచ్చినప్పుడు వస్తున్నారు వెళ్లిపోతున్నారు. ఒక వేళ వచ్చినా బాధితుల గురించి పట్టించుకోవడం లేదు. తమ కు కేటాయించిన గదులకే పరిమితమైపోతున్నారు. అంతా నర్సులు, ఎంఎన్‌ఓలు, సెక్యూరిటీ గార్డులే చూసు కోవాల్సి న దుస్థితి ముం దు నుంచి ఉంది. బాధితుల వద్దకు వారే వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు చూడాల్సి వస్తోంది. ఒక వేళ డాక్టర్‌ వచ్చినా వారిని కనీసం ముట్టుకోరు. దూరం నుంచే మాట్లాడి ఏదో పేపర్లో రాసి వీటిని ఇవ్వాలని నర్సులకు చెప్పి వెళ్లిపోతున్నారు. కనీసం కొవిడ్‌ విభాగా ల్లో బాధితుల ఆరోగ్యం, వారికి అందుతున్న సేవలు యం త్రాల పనితీరు, ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా వంటి విషయాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సీరియస్‌ సమయాల్లో బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించలేకపోతున్నారు. ఇందుకు ఏపీఎంఐపీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సు బ్బరాయుడు మృతి ఘటనే ఉదాహర ణ. ఆయన పరిస్థితి సీరియ్‌సగా ఉందని, అ వసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో పీడీ చాలా ఇబ్బంది పడి, చివరకు ప్రాణాలు కో ల్పోయారు. ఈ నిర్లక్ష్యంపై కలెక్టర్‌ గం ధం చంద్రుడు ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఇద్దరు డాక్టర్లను సస్పెండ్‌ చేశారు. మరి కొంత మందికి షోకాజ్‌లు ఇచ్చారు. ఒక జిల్లా అధి కారికే అది కూడా కలెక్టర్‌ చెప్పి నా అలసత్వం వహించారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి కొవిడ్‌ ఆస్పత్రికి వె ళితే ఎలా ఉంటుందో ఆలోచిస్తే భయమేస్తోంది. మరి కొందరు సిబ్బంది కరోనా బా ధితుల జీవితాలను ఆసరా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. సూపర్‌ స్పెషాలి టీ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆక్సిజన్‌ బెడ్లు అమ్ముకుం టూ జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికే సూపర్‌ స్పెషా లిటీలో బెడ్ల అమ్మకంపై పెద్దదుమారం రేపినా ఎవరు పట్టించుకోలేదు. జిల్లా ఆస్పత్రిలోనూ కొందరు సిబ్బంది బాధితుల బంధువులతో అవసరాన్ని బట్టి రూ.5 వేల నుం చి రూ.7 వేల వరకు బెడ్డు కోసం వసూలు చేసుకుంటు న్నారని బహిరంగంగా వినిపిస్తోంది. కానీ అధికారులు, నో డల్‌ ఆఫీసర్లు కూడా ఈ ఆరోపణలపై ఎక్కడా నోరు మెదపకపోవడం, సీరియ్‌సగా హెచ్చరికలు చేయకపోవ డం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. 


పీడీ మరణంతో ఉద్యోగుల కుటుంబాల్లో  అలజడి

ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు మరణం అధికారులు, ఉద్యోగుల కుటుంబాల్లో అలజడి రేపుతోంది. ఆయన కరో నా బారిన పడి సకాలంలో బెడ్లు దొరక్క ఆస్పత్రిలో చేర్చు కోక వైద్యసేవలు అందక మరణించారన్న ప్రచారం జరు గుతోంది. వైద్యులు కూడా ఆయనకు అందించే వైద్య సేవ ల విషయంలో నిర్లక్ష్యం వహించారని స్వయంగా కలెక్టర్‌ డాక్టర్లపై వేటు వేయడంతో మరింత ఆందోళన చెందుతు న్నారు. చాలా మంది వివిధ శాఖల అధికారులు, ఉద్యోగు లు, కొవిడ్‌ విభాగాల్లో పనిచేస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పు డు పీడీ మరణించడంతో ఆయా కుటుంబాల్లో కొవిడ్‌ విధులకు వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ విధులకు వెళ్లొద్దంటూ ఆయా అధికారులు, ఉద్యోగులపై కుటుం బ సభ్యులు ఒత్తిడి పెడుతున్నారు. ఓ అధికారి  ఇదే విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశా రు. ఇక్కడ కలెక్టర్‌ డ్యూటీ చేయాలంటారు. అక్కడ ఇంట్లో వాళ్లు కొవిడ్‌ డ్యూటీలకు వెళ్లద్దంటారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. అంటే ఒక్క పీడీ విషయంలో జరిగిన అలసత్వం ఇతర అధికారులు, ఉద్యో గుల ఇళ్లలో ఎంత ఆందోళన కలిగిస్తోందో అర్థం చేసుకోవ చ్చు. ఈ ఆందోళన తగ్గాలంటే భవిష్యత్తులో ఇలాంటి పొ రపాటు జరగకుండా చూడాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం పె రిగి ధైర్యంతో పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. లేదంటే రాబోయే కాలంలో కొవిడ్‌ విధులకు అందరూ దూరమ య్యే అవకాశాలు ఉన్నాయి.


Updated Date - 2021-05-17T05:38:05+05:30 IST