‘వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను చనిపోయే స్థితిలో ఉన్నా..’

ABN , First Publish Date - 2020-08-08T21:49:57+05:30 IST

నా ముక్కు ద్వారా రక్తస్రావం జరుగుతున్నా వైద్యులు పట్టించుకోవడం లేదు. నేను ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నాను’ అంటూ

‘వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను చనిపోయే స్థితిలో ఉన్నా..’

జీజీహెచ్‌లో కొవిడ్‌ బాధితుడి వీడియో  


గుజరాతీపేట(శ్రీకాకుళం): ‘నా ముక్కు ద్వారా రక్తస్రావం జరుగుతున్నా వైద్యులు పట్టించుకోవడం లేదు.  నేను ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నాను’ అంటూ ఓ కొవిడ్‌ బాధితుడు పెట్టిన సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పాలకొండ మండలం ఓ గ్రామానికి చెందిన వ్యక్తి పేట్‌లెట్స్‌ పడిపోయి, ఆయాసం, జ్వర లక్షణాలతో వారం రోజుల కిందట శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌)లో చేరాడు. సహజంగా ఆయాసం, జ్వరం వంటి లక్షణాలతో బాధపడే వారికి జీజీహెచ్‌లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తారు.


అదే మాదిరిగా  పాలకొండకు చెందిన వ్యక్తికి కూడా వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అయితే,  వైద్యులు పట్టించుకోవడం లేదంటూ ఆయన పెట్టిన వీడియోపై చీఫ్‌ కొవిడ్‌ నోడల్‌ ఆఽఫీసర్‌ డాక్టర్‌ అరవింద్‌ స్పందించారు. బాధితుడికి తగిన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఆయాసం, జ్వరం వంటి లక్షణాలతో ఉండడంతో బాధితుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అరవింద్‌ తెలిపారు.


Updated Date - 2020-08-08T21:49:57+05:30 IST