వైద్యాధికారులు మరింత బాధ్యతతో పని చేయాలి

ABN , First Publish Date - 2020-04-09T11:54:58+05:30 IST

కరోనా తీవ్రత దృ ష్ట్యా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వైద్యాధికా రులు మరింత బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్‌ పో

వైద్యాధికారులు మరింత బాధ్యతతో పని చేయాలి

కలెక్టర్‌ పోలా భాస్కర్‌


ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 8 : కరోనా తీవ్రత దృ ష్ట్యా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వైద్యాధికా రులు మరింత బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్‌ పో లా భాస్కర్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్ట ర్‌ ఛాంబర్‌లో బుధవారం వైద్యాధికారులు, ప్రైవేటు హాస్పటల్‌ యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా అనుమానిత లక్షణాలు, వైరస్‌ బారిన పడిన వారికి అందించే వైద్య చికిత్సలపై ప్రత్యేక చర్యలు తీ సుకోవాలన్నారు.


జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆస్పత్రుల్లో చేరే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాస్థాయిలో ఆస్పత్రుల పర్యవేక్షణ కు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడంతో ప్రత్యేకం గా ఒక కంట్రోలురూమ్‌ను కూడా ఏర్పాటు చేశామ న్నారు. ఆస్పత్రులలో కోవిడ్‌-19 లక్షణాలున్న వారిని క మిటీ పర్యవేక్షించాలని ఆదేశించారు. ఒంగోలులోని ప్రభుత్వ జనరల్‌ హాస్పటల్‌కు ఆక్సిజన్‌ సరఫరా చేసే ఏజెన్సీలపై దృష్టి సారించి అవసరమైన మేరకు సరఫ రా చేసేలా చర్యలు తీసుకోవాలని రిమ్స్‌ సూప రింటెం డెంట్‌ శ్రీరాములును కలెక్టర్‌ ఆదేశించారు. క్లిష్ట మైన కేసుల వైద్యచికిత్స కోసం కిమ్స్‌ ఆసుప్రిని కోవిడ్‌ వైద్య శాలగా మార్చి పాజిటివ్‌ కేసులను అక్కడ ఉంచు తా మని చెప్పారు. అవసరమైన మేరకు నగరంలోని రమే ష్‌ సంఘమిత్ర, వెంకటరమణ హాస్పటల్‌, నల్లూరి నర్సింగ్‌హోంలను వినియోగించుకోనున్నామని తెలిపా రు.


సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.నీర ద, పలు శాఖల అధికారులు ఎలీషా, శీనారెడ్డి,   రిమ్స్‌ ఆర్‌ఎంవో వేణుగోపాల్‌రెడ్డి, కిమ్స్‌ మెడికల్‌ సూపరిం టెండెంట్‌ వెంకటేశ్వర్లు, జీజీహెచ్‌ డీడీ మంజుల, పరి శ్రమల శాఖ మేనేజర్‌ చంద్రశేఖర్‌, డీపీహెచ్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. 


ఒంగోలులో సమగ్ర సర్వే

ఒంగోలు నగరంలో 12 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో నగరమంతా సమగ్ర సర్వే చేపడతామని కలెక్టర్‌ పో లా భాస్కర్‌ తెలిపారు. బుధవారం రాత్రి స్ధానిక కలె క్టర్‌ ఛాంబర్‌లో జిల్లా అధికారులు, ముస్లిం మత పె ద్దలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య నగరంలో పెరగడం తో పూర్తిస్థాయిలో కంటైన్మెంట్‌ జోన్‌గా చేశామని, ప్ర ధానంగా ఇస్లాంపేట రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు చె ప్పారు. ఇస్లాంపేట అత్యంత ఇరుకుగా ఉందని, సన్ని హితులకు వ్యాధి సోకే  అవకాశం ఉందని, వైరస్‌ వ్యా ప్తిచెందకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు.


అంతేగాకుండా జనసంచారం నిషే ధించాలని, ఇంట్లో నుంచి ఎవరినీ బయటకు రానీయ వద్దని ఎస్పీకి సూచించారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ని పెద్దలు సహకరించాలని కోరారు. అనుమానాస్పద కేసులుగా గుర్తించిన వారిని యుద్ధప్రాతిపదికన క్వా రంటైన్‌ కేంద్రానికి తరలించాలని చెప్పారు. నగరంలో ని ఇస్లాంపేట కంటైన్మెంట్‌ జోన్‌లో 5,250 కుటుంబా లు ఉండగా రెడ్‌జోన్‌ పరిధిలో 3,850 కుటుంబాలు ని వాసం ఉంటున్నాయని కలెక్టర్‌ చెప్పారు. కూరగాయ లు, నిత్యావసర సరుకులు ఇంటి వద్దకు చేర్చేలా ఏర్పా ట్లు చేయాలన్నారు. ఇందుకోసం ఉపకలెక్టర్‌, కార్పొరే షన్‌ కమిషనర్‌ దృష్టి సారించాలన్నారు.


సమవేశంలో ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్‌, జేసీ షన్మోహన్‌, డీఆర్వో వెంకట సుబ్బయ్య, ట్రైనింగ్‌ ఎస్పీ జగదీష్‌, డీఎంహెచ్‌వో అప్ప లనాయుడు, డాక్టర్‌ ఉషారాణి, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక కలెక్టర్‌ వసంతకుమార్‌, వైద్యాధికారి రమణ త దితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-04-09T11:54:58+05:30 IST