కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాలి

ABN , First Publish Date - 2021-05-14T06:07:25+05:30 IST

కరోనా బాధితుల కు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర కొవిడ్‌ నోడల్‌ అధికారి శ్రీకాంత్‌ ఆదేశించారు. గురువారం ఒంగోలులోని రిమ్స్‌ హాస్పటల్‌తో పాటు ట్రిపుల్‌ ఐటీని ఆయన సందర్శించారు.

కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాలి
రిమ్స్‌లోని కరోనా బాధితుల అడ్మిషన్‌ విభాగాన్ని పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి శ్రీకాంత్‌

నోడల్‌  అధికారి శ్రీకాంత్‌


ఒంగోలు(కలెక్టరేట్‌), మే 13 : కరోనా బాధితుల కు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర కొవిడ్‌ నోడల్‌ అధికారి శ్రీకాంత్‌ ఆదేశించారు. గురువారం ఒంగోలులోని రిమ్స్‌ హాస్పటల్‌తో పాటు ట్రిపుల్‌ ఐటీని ఆయన సందర్శించారు. ప్రధానంగా రిమ్స్‌లో కరోనా బాధితులు కన్నా ఇతరులు ఎక్కువగా ఉం డటాన్ని గుర్తించి సూపరింటెండెంట్‌ శ్రీరాములు, ఆర్‌ఎంవో వేణుగోపాల్‌రెడ్డితో మాట్లాడారు. పాజి టివ్‌ బాధితుల వద్దకు ఎక్కువ మందిని అనుమ తించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. అంతేగాకుండా కొవిడ్‌ కేర్‌ సెంటర్ల వై ద్యులు, నర్సులకు పీపీఈ కిట్స్‌ అందజేసి తప్ప నిసరిగా వాటిని ధరలించేలా చూడాలన్నారు. లే కుంటే రోగులకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ప్ర భుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని నోడల్‌ అధికారి శ్రీకాంత్‌ ఆదేశించారు. కాగా ట్రిపుల్‌ఐటీలో ప్రస్తు తం కరోనా బాధితులకు భోజనాలు పెడుతున్న ప్లే ట్లు బాగా లేవని, వెంటనే వాటిని మార్చాలని  ఆ యన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ-3 కృ ష్ణవేణి, జిల్లా నోడల్‌ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎస్టీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస్‌విశ్వనాథ్‌, రిమ్స్‌ డి ప్యూటీ సూపరిటెండెంట్‌ మురళీకృష్ణారెడ్డి తదితరు  లు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-14T06:07:25+05:30 IST