ఘనంగా డాక్టర్స్‌ డే

ABN , First Publish Date - 2022-07-02T06:30:40+05:30 IST

శుక్రవారం ప్రపంచ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది.

ఘనంగా డాక్టర్స్‌ డే
నూజివీడులో వైద్యులను సన్మానిస్తున్న లయన్స్‌క్లబ్‌ సభ్యులు

శుక్రవారం ప్రపంచ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రాణం పోసే వైద్యుడు దైవంతో సమానమని అందుకే  వైద్యో నారాయణో హరి అన్నారని పలువురు వక్తలు కొనియాడారు. వైద్యులను సత్కరించారు.

కలిదిండి, జూలై 1: కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం డాక్టర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. వైద్యాధికారులు ప్రసాద్‌, జాహ్నవిలను వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ఘనంగా సత్కరించారు. కమ్యూ నిటీ హెల్త్‌ ఆఫీసర్‌ దేవుడు తదితరులు పాల్గొన్నారు.

ముదినేపల్లి: ముదినేపల్లి పీహెచ్‌సీలో శుక్రవారం ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్యాధికారులు డాక్టర్‌ దమయంతి, డాక్టర్‌ శాంతిశ్రీ, సిబ్బంది కేక్‌ కట్‌ చేసి  శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డాక్టర్లను ప్రజలు ప్రత్యక్ష దైవాలుగా భావిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైద్య వృత్తిని అంకిత భావంతో నిర్వహించాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ దమయంతి పేర్కొన్నారు. పీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 

నూజివీడు టౌన్‌: డాక్టర్స్‌ డే సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నూజివీడు గ్రేటర్‌ ఆధ్వర్యంలో నూజివీడు ఏరియా ఆసుపత్రి వైద్యులను  ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విశేష సేవలందిస్తోన్న డాక్టర్‌ నరేంద్ర సింగ్‌, డాక్టర్‌ రవికుమార్‌, డాక్టర్‌ మాధవిలను సత్కరించారు. లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్‌ పర్సన్‌ కాలి సురేష్‌బాబు, ప్రెసిడెంట్‌ శ్రీనివాసరావు, సెక్రటరీ రఫీ, ట్రెజరర్‌ నాగేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:30:40+05:30 IST