ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2022-05-18T05:25:57+05:30 IST

ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉండా లని డీసీహెచ్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన తంబళ్లపల్లె సీహెచ్‌సీ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలి
ఆసుపత్రిలో సేవలపై ఆరాతీస్తున్న డీసీహెచ్‌ఎస్‌ చంద్రశేఖర్‌

తంబళ్లపల్లె, మే 17: ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉండా లని డీసీహెచ్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన తంబళ్లపల్లె సీహెచ్‌సీ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఆపరేషన్‌ థి యేటర్‌, బాలింతల వార్డు, ఓపీ, ఎక్స్‌రే విభా గం, డెంటల్‌ విభాగం, ఐ కేంద్రం, ఫార్మసీ, ల్యాబ్‌, కొవిడ్‌ వార్డులను సందర్శించి పలు సూచనలిచ్చారు. ఓపీ, మందుల నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో నిల్వ ఉన్న మందులు, అవసర మైన మందులు, ఎక్స్‌పైరీ అయిన మందుల జాబితాను ఎప్పటికప్పుడు రికార్డులలో నమో దు చేయాలని పార్మసిస్టులు తనూజ, లక్ష్మీ పతికి ఆదేశించారు. సిబ్బంది కొరత, తదితర అంశాలను వైద్యాధికారి హిమశైలజను అడిగి తెలుసుకున్నారు. ఓపీకి దగ్గరగా మందులిచ్చే వార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫిజియోఽథెరపీకి సంబంధించిన పరికరాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రిలో సుమారు రూ.5 కోట్ల  అంచనా వ్యయంతో చేస్తున్న అభివృదిఽ్ధ పనులను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ లో పెరిగిన పిచ్చిమొక్కలను వెంటనే వాటిని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశమ య్యారు. వైద్యులు బాబాఫకృద్దీన్‌, హెడ్‌ నర్సు గ్లోరీ లిటిల్‌ ఫ్లవర్‌, స్టాప్‌ నర్సులు మరి యమ్మ, నీలిమా, కృపాలత, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-18T05:25:57+05:30 IST