Bangalore IIMలో డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌

ABN , First Publish Date - 2022-09-21T22:40:19+05:30 IST

బెంగళూరు(Bangalore)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(Indian Institute of Management) (ఐఐఎంబీ) - డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Bangalore IIMలో డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌

బెంగళూరు(Bangalore)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(Indian Institute of Management) (ఐఐఎంబీ) - డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్లు. జాతీయ పరీక్ష స్కోర్‌/ ఐఐఎంబీ టెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు. ఐఐఎంబీ టెస్ట్‌ను రెండు విడతల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు గరిష్ఠంగా రెండు స్పెషలైజేషన్‌లకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

స్పెషలైజేషన్‌లు: డెసిషన్‌ సైన్సెస్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఎకనామిక్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, మార్కెటింగ్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ పాలసీ, స్ట్రాటజీ 

అర్హత: ఏదేని స్పెషలైజేషన్‌తో మాస్టర్స్‌ డిగ్రీ/ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ/ రెండేళ్ల పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. బీకాంతోపాటు ద్వితీయ శ్రేణి మార్కులతో సీఏ/ ఐసీడబ్ల్యుఏఐ/ సీఎస్‌ ఉత్తీర్ణులు; ప్రథమశ్రేణి మార్కులతో నాలుగేళ్ల ప్రొఫెషనల్‌ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్పెషలైజేషన్‌ను అనుసరించి డిసెంబరు 12 నాటికి  జీమ్యాట్‌/ జీఆర్‌ఈ/ క్యాట్‌/ గేట్‌/ జేఆర్‌ఎఫ్‌ నెట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. లేదంటే ఐఐఎంబీ నిర్వహించే టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జాతీయ పరీక్ష వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్న అభ్యర్థులు ఒక స్పెషలైజేషన్‌కు అప్లయ్‌ చేస్తే రూ.1000, రెండు స్పెషలైజేషన్‌లకు అప్లయ్‌ చేస్తే రూ.1500 చెల్లించాలి. ఐఐఎంబీ టెస్ట్‌ రాసే అభ్యర్థులు ఒక స్పెషలైజేషన్‌కు అప్లయ్‌ చేస్తే రూ.2000; రెండు స్పెషలైజేషన్‌లకు అప్లయ్‌ చేస్తే రూ.2500 చెల్లించాలి.  

చివరి తేదీలు: అక్టోబరు 10, డిసెంబరు 12

ఐఐఎంబీ టెస్ట్‌ తేదీలు: అక్టోబరు 16, డిసెంబరు 18 

జాతీయ పరీక్ష స్కోర్‌ ఉన్న అభ్యర్థులు డిసెంబరు 12లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూలు: 2023 ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు

వేదిక: బెంగళూరు క్యాంపస్‌  

వెబ్‌సైట్‌: iimb.ac.in

Updated Date - 2022-09-21T22:40:19+05:30 IST