డాక్టర్‌ శంకరరావు ఇక లేరు

ABN , First Publish Date - 2020-09-25T17:04:51+05:30 IST

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వ యాధికారిగా సమర్థవంతంగా సేవలందించి..

డాక్టర్‌ శంకరరావు ఇక లేరు

తీవ్ర అనారోగ్యంతో కన్నుమూత

కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స

పిల్లల వైద్యుడిగా మంచి గుర్తింపు

డీసీహెచ్‌ఎస్‌గా సుదీర్ఘకాలం సేవలు

గత నెలాఖరున పదవీ విరమణ

ఆరోగ్య శాఖ మంత్రి నాని సంతాపం


తాడేపల్లిగూడెం: జిల్లా ఆసుపత్రి సేవల సమన్వ యాధికారిగా సమర్థవంతంగా సేవలందించి.. గత నెల 31న పదవీ విరమణ పొందిన డాక్టర్‌ కె.శంకరరావు  (63) ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయన మరణంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయనకు భార్య భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అషిత తండ్రి అడుగు జాడల్లోనే చిన్న పిల్లల వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. చిన్న కుమార్తె సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 


శంకరరావు స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో తట్టివర్రు. తండ్రి పరంధామయ్య కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. తాడేప ల్లిగూడెంలో 39 ఏళ్లపాటు పిల్లల వైద్యునిగా పేరుతెచ్చుకు న్నారు. తాడేపల్లిగూడెంలో పలు సామాజిక సేవలతోపాటు పలు సేవాసంస్థల్లో భాగస్వామిగా నిలిచారు. ఆయన ఎయిర్‌ స్ట్రిప్‌ వాకర్స్‌ సంఘ అధ్యక్షుడిగాను పనిచేశారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. ఉభ యగోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసి పేద ప్రజలకు సేవలందించారు.  కొవిడ్‌ కాలంలో అటు వైద్య సిబ్బందికి అండగా నిలిచారు. ఇటు రోగులకు మంచి సేవలందించారు. పదవీ విరమణ తర్వాత సెప్టెంబరు 5న జ్వరంతోపాటు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో స్థానికంగా వైద్యం చేయించారు.


తలలో రక్తనాళాలు చిట్లి రక్తం గడ్డ కట్టినట్లుగా గుర్తిం చడంతో హైదరాబాదులోని యశో దా ఆసుపత్రికి తరలించారు. అం తలోనే కిడ్నీ సంబంధిత సమస్య తలెత్తడంతో డయాలసిస్‌ చేశారు. ఇప్పటి వరకు వెంటిలేటర్‌పై ఆయన ఉన్నారు. పరిస్థితి విష మించడంతో గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు.  డాక్టర్‌ శంకరరావు పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ నుంచి తీసు కువచ్చి పెదతాడేపల్లిలోని ఆయనకు ఎంతో ఇష్టమైన తోటలో గురువారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు.  


బాధాకరం : మంత్రి ఆళ్ల నాని

ఏలూరు రూరల్‌ : శంకరరావు మృతి అత్యంత బాధాకర మని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని సంతాపం తెలియజేశారు. వైద్య వృత్తిలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొని యాడారు. కరోనా సమయంలో అహర్నిశలు శ్రమించారని చిన్న పిల్లల వైద్యుడిగా లక్షలాది మందికి ప్రాణం పోశార న్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

 

మరణం తీరని లోటు   

శంకరరావు మరణం తీరని లోటని ఇన్‌ చార్జ్‌ జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ అన్నారు.డీసీహెచ్‌ఎస్‌గా ఏడేళ్లపాటు ఉత్తమ సేవలందించారన్నారు.మంచి అధికారిని కోల్పోయా మన్నారు. మంచి మిత్రుడిని కోల్పోయానని తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని అన్నారు. 



Updated Date - 2020-09-25T17:04:51+05:30 IST