డాక్టర్‌ రఘురామ్‌ అరుదైన ఘనత!

ABN , First Publish Date - 2021-10-28T09:41:36+05:30 IST

కిమ్స్‌ ఉషాలక్ష్మి సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘురామ్‌ అరుధైన ఘనత సాధించారు. అమెరికాలో అక్టోబర్‌ 23 నుంచి 27 వరకు..

డాక్టర్‌ రఘురామ్‌ అరుదైన ఘనత!

  • అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ సదస్సులో ప్రసంగించిన
  • తొలి దక్షిణాసియా వైద్యుడిగా ఖ్యాతి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): కిమ్స్‌ ఉషాలక్ష్మి సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘురామ్‌ అరుధైన ఘనత సాధించారు. అమెరికాలో అక్టోబర్‌ 23 నుంచి 27 వరకు జరిగిన ‘కాంగ్రెస్‌ ఆఫ్‌ అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌’ 107వ వార్షికోత్సవంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాసియాకు చెందిన వైద్యుడిగా రికార్డులకెక్కారు. ఈ కార్యక్రమంలో.. అమెరికా అధ్యక్షుడి చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ ఆంథోని ఫౌసి, మరో 9మంది అమెరికన్‌ వైద్యులు, మనదేశానికి చెందిన డాక్టర్‌ రఘురామ్‌ పాల్గొన్నారు. భారత మహిళల్లో బ్రెస్ట్‌ హెల్త్‌కేర్‌ పట్ల నిర్లక్ష్యం - అడ్డంకులు అనే అంశంపై ఆయన 55 నిమిషాల పాటు ప్రసంగించారు. బ్రెస్ట్‌కేర్‌ రంగంలో డాక్టర్‌ రఘురాం.. యూకేకు భారత్‌కు మధ్య లివింగ్‌ బ్రిడ్జిలా పనిచేస్తున్నారని పలువురు వైద్యులు ప్రశంసించారు.

Updated Date - 2021-10-28T09:41:36+05:30 IST