హా..పరేషన్లు

ABN , First Publish Date - 2021-09-05T07:23:54+05:30 IST

త్తీ్‌సగఢ్‌లోని ఓ సర్జన్‌పై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఒక సర్జన్‌ ఒక రోజులో 30 మందికే ఆ ఆపరేషన్లు చేయాలి. కానీ, సర్గుజా జిల్లాలోని నర్మదాపూర్‌లో ప్రభుత్వం గత నెల 27న ఏర్పాటు చేసిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స ప్రత్యేక శిబిరంలో సర్జికల్‌ ...

హా..పరేషన్లు

  • ఒక్క డాక్టర్‌.. 7 గంటలు.. 101 కు.ని. శస్త్రచికిత్సలు
  • ఛత్తీస్‌గఢ్‌లో ఘటన.. అక్కడి సర్కారు సీరియస్‌ 
  • వైద్యుడికి షోకాజ్‌.. దర్యాప్తునకు ఆదేశం
  • రోజుకు ఒక సర్జన్‌ గరిష్ఠంగా 30 మందికే
  • పోటెత్తితే తప్పలేదు.. వైద్యుడి వివరణ

రాయ్‌పూర్‌, సెప్టెంబరు 4: ఛత్తీ్‌సగఢ్‌లోని ఓ సర్జన్‌పై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఒక సర్జన్‌ ఒక రోజులో 30 మందికే ఆ ఆపరేషన్లు చేయాలి. కానీ, సర్గుజా జిల్లాలోని నర్మదాపూర్‌లో ప్రభుత్వం గత నెల 27న ఏర్పాటు చేసిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స ప్రత్యేక శిబిరంలో సర్జికల్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ జిబ్నస్‌ ఎక్కా 7 గంటల్లో ఏకం గా 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స(ట్యూబెక్టమీ) చేశారు. దీన్ని స్థానిక దినపత్రిక ఒకటి వెలుగులోకి తేవడంతో స్పందించిన ఉన్నతాధికారులు సర్జన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. పోటెత్తితే ఎక్కువ ఆపరేషన్లు చేయక తప్పలేదని ఎక్కా చెప్పారు.







Updated Date - 2021-09-05T07:23:54+05:30 IST