కాలు నొప్పిగా ఉందన్న వ్యక్తి.. నువ్వు చేసిన నీచానికి ఆ పాప ఎంత నరకం అనుభవించిందో అంటూ డాక్టర్ ఫైర్.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-11-12T03:40:32+05:30 IST

అక్కడంతా నిశ్శబ్దం. అందరి మనసుల్లోనూ ఏదో బాధ! ఇంతలో ఓ వ్యక్తి అక్కడున్న డాక్టర్ వద్దకు వచ్చాడు. అక్కడున్న వారందరూ అతడినే చూస్తున్నారు. డాక్టర్ ముందున్న స్టూల్‌పై కూర్చున్న అతడు.. కాలు నొప్పి పుడుతోందని చెప్పాడు. అంతే.. అప్పటివరకూ పంటిబిగువున తన కోపాన్ని అదుపులో పెట్టుకున్న

కాలు నొప్పిగా ఉందన్న వ్యక్తి.. నువ్వు చేసిన నీచానికి ఆ పాప ఎంత నరకం అనుభవించిందో అంటూ డాక్టర్ ఫైర్.. అసలు కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: అక్కడంతా నిశ్శబ్దం. అందరి మనసుల్లోనూ ఏదో బాధ!  ఇంతలో ఓ వ్యక్తి అక్కడున్న డాక్టర్ వద్దకు వచ్చాడు. అక్కడున్న వారందరూ అతడినే చూస్తున్నారు. డాక్టర్ ముందున్న స్టూల్‌పై కూర్చున్న అతడు.. కాలు నొప్పి పుడుతోందని చెప్పాడు. అంతే.. అప్పటివరకూ పంటిబిగువున తన కోపాన్ని అదుపులో పెట్టుకున్న ఆ డాక్టర్ ఒక్కసారిగా నిగ్రహం కోల్పోయాడు. కాస్త కాలు నొప్పి పుట్టిందనగానే వెంటనే డాక్టర్‌కు చెబుతున్నావ్..మరి నీవు చేసిన దారుణానికి ఆ పాప ఎంత నరకం అనుభవించిందో తెలుసా అంటూ ఆ డాక్టర్ ఇంతెత్తున లేచాడు. వైద్యుడే కాదు.. అక్కడున్న వారందరి కళ్లల్లో అతడి పట్ల ఏహ్య భావం కనిపించింది. గుజరాత్ రాష్ట్రం పండెసేరా ప్రాంతంలోని ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన ఇది. వైద్యుడి ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి పేరు గుడ్డూ కుమార్.


రెండేళ్ల చిన్నారిని హత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గుడ్డూ కుమార్‌ను పోలీసులు మంగళవారం నాడు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అది దీపావళి ముందు రోజు. ఆస్పత్రిలో పండగ వాతావరణం నెలకొంది. అయితే..నిందితుడి రాకతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. పసికందు అన్న కనికరం కూడా చూపకుండా అతడు చేసిన అకృత్యం గురించి తెలుసుకున్న వైద్యులు నిర్ఘాంతపోయారు. దీపావళి రోజునే ఆ నిందితుడు ఓ చిన్నారి కళ్లల్లో దీపాన్ని ఆర్పేశాడని తెలిసి తల్లడిల్లిపోయారు. 


అయితే..తమ వృత్తిధర్మాన్ని అనుసరిస్తూ అతడికి అన్ని పరీక్షలు చేశారు. ఈ క్రమంలో అతడు కాలు నొప్పిగా ఉందంటూ చెప్పడంతో ఓ వైద్యుడికి కోపం నషాళానికంటింది. దీంతో..నిందితుడిపై ఆయన ఇంతెత్తున ఎగిరిపడ్డారు. మనసులో ఉన్న ఆవేదన అంతా వెళ్లబోసేసుకున్నాడు. కాగా.. వైద్య పరీక్షల అనంతరం..పోలీసులు నిందితుడిని మంగళవారం నాడు కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం.. విచారణను వాయిదా వేసిన న్యాయమూర్తి..నిందితుడిని మూడు రోజుల పాటు రిమాండ్‌ విధించారు.    

Updated Date - 2021-11-12T03:40:32+05:30 IST