చావు బతుకుల మధ్య వెంటిలేటర్‌పై భార్య.. చికిత్స కోసం డబ్బులు సరిపోక తన డాక్టర్ డిగ్రీ తాకట్టు పెట్టిన భర్త.. కోట్లు ఖర్చు చేశాక ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-13T05:48:30+05:30 IST

చావు బతుకుల మధ్య ఉన్న భార్య కోసం అతను ఎంతో పోరాటం చేశాడు. చికిత్స కోసం కోట్లు ఖర్చు పెట్టాడు. చివరకు తన డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్‌ను కూడా తాకట్టు పెట్టాడు.. 1.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన ప్రేమను...

చావు బతుకుల మధ్య వెంటిలేటర్‌పై భార్య.. చికిత్స కోసం డబ్బులు సరిపోక తన డాక్టర్ డిగ్రీ తాకట్టు పెట్టిన భర్త.. కోట్లు ఖర్చు చేశాక ఏం జరిగిందంటే..

చావు బతుకుల మధ్య ఉన్న భార్య కోసం అతను ఎంతో పోరాటం చేశాడు. చికిత్స కోసం కోట్లు ఖర్చు పెట్టాడు. చివరకు తన డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్‌ను కూడా తాకట్టు పెట్టాడు.. 1.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన ప్రేమను కాపాడుకున్నాడు.. భార్య కోసం అతను చేసిన పోరాటం ఎంతో మంది ప్రశంసలు అందుకుంటోంది. 


వివరాల్లోకి వెళితే.. పాలి జిల్లా ఖైర్వా గ్రామానికి చెందిన సురేష్ చౌధురి అనే వ్యక్తి తన భార్య అనిత, ఐదేళ్ల కొడుకుతో కలిసి తన గ్రామంలో నివసిస్తున్నాడు. గత ఏడాది మేలో అనితకు కరోనా సోకింది. పరిస్థితి సీరియస్ కావడంతో ఎంతో ప్రయత్నించి ఆమెను జోధ్‌పూర్ ఎయిమ్స్‌ హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. మే 30న అనిత పరిస్థితి మరింత దిగజారింది. ఆ సమయానికి, ఆమె ఊపిరితిత్తులు 95 శాతం క్షీణించాయి. దీంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమె బతకడం చాలా కష్టమని వైద్యులు చెప్పారు. దాంతో సురేశ్‌ తన భార్యను జూన్‌ 1న అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు.


అక్కడ అనితను ఎక్మో మెషీన్‌పై ఉంచారు. ఈ ప్రక్రియ చాలా ఖరీదైనది. ఎక్మో కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది. అనిత దాదాపు 87 రోజుల పాటు ఎక్మో మెషీన్‌పైనే ఉంది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. భార్య చికిత్స కోసం సురేష్ అన్నింటినీ పణంగా పెట్టాడు. భార్య చికిత్సకు కావాల్సిన డబ్బుల కోసం సురేష్ తన ఎంబీబీఎస్ డిగ్రీని బ్యాంకులో తనఖా పెట్టి రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తన స్నేహితులు, బంధువుల నుంచి 20 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అలాగే తన ప్లాట్‌ను రూ.15 లక్షలకు విక్రయించాడు. గ్రామంలో తన పేరు మీద ఉన్న భూములన్నీ అమ్మేశాడు. మొత్తం మీద రూ.1.25 లక్షలు ఖర్చు పెట్టి తన భార్యను కాపాడుకున్నాడు. 




Updated Date - 2022-03-13T05:48:30+05:30 IST