లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్‌ డే

ABN , First Publish Date - 2022-07-02T05:03:09+05:30 IST

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్స్‌ డేను ఘనంగా నిర్వహించారు.

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్‌ డే
ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డిని సత్కరిస్తున్న లయన్స్‌ క్లబ్‌ సభ్యులు

గజ్వేల్‌ రూరల్‌, జూలై 1: లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్స్‌ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్స్‌ను, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, కౌన్సిలర్‌ ఉప్పల మెట్టయ్య లయన్స్‌ క్లబ్‌ స్నేహ అధ్యక్షుడు మతీన్‌, సభ్యులు, డాక్టర్స్‌ పాల్గొన్నారు. 

మద్దూరులో 

మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో డాక్టర్స్‌ డే వేడుకలను సిబ్బంది శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రాజును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో జీ.శేషగిరి, హెచ్‌ఎస్‌ హేమలత, హెచ్‌ఎస్‌ రఘు, స్టాఫ్‌నర్స్‌ మాధవి, ఏఎన్‌ఎంలు రత్న, నిర్మల, జ్యోతి, స్వరూప, శాంత తదితరులు పాల్గొన్నారు. 

సిద్దిపేట వాసవీ వనిత క్లబ్‌ ఆధ్వర్యంలో

సిద్దిపేట: సిద్దిపేట వాసవీ వనిత క్లబ్‌ ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డేను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సామలేటి కుమారస్వామి, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ భాస్కరరావు, న్యూరో సర్జన్‌ తాటికొండ అనిల్‌కుమార్‌, గైనకాలజిస్టు గాయత్రి, స్కిన్‌ స్పెషలిస్టుసరితలను వారి వారి క్లినిక్‌లలో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు సోమశివకుమార్‌ వనజ తదితరులు పాల్గొన్నారు. అలాగే యునాని ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్స్‌ డే సందర్భంగా ఆయుష్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ (వరంగల్‌) డాక్టర్‌ రవినాయక్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఉమాదేవి, అజీమ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T05:03:09+05:30 IST