Hyd : యువతిని మోసం చేసిన డాక్టర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2021-07-15T14:57:26+05:30 IST

తనకు వివాహం అయిన విషయం దాచిపెట్టి ..

Hyd : యువతిని మోసం చేసిన డాక్టర్‌ అరెస్టు

హైదరాబాద్ సిటీ/హైదర్‌నగర్‌ : తనకు వివాహం అయిన విషయం దాచిపెట్టి ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసానికి యత్నించిన డాక్టర్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా బ్రాడీపేటకు చెందిన గబ్బిట అభిరాంచంద్ర గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నాడు. నిజాంపేట రోడ్‌ నాగార్జునహోంలో నివసించే నిషిత ఫిట్‌నెస్‌ ట్రైనీగా పనిచేస్తుంది. సెప్టెంబర్‌ 2020లో నిషిత బంబుల్‌ అనే డేటింగ్‌ యాప్‌లో తన వివరాలు అప్‌లోడ్‌ చేసింది. 


యాప్‌ ద్వారా అభిరాంచంద్ర నిషితకు పరిచయమయ్యారు. తనకు వివాహమైన విషయం దాచిపెట్టి నిషితను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడితో పరిచయం పెంచుకున్న నిషితకు అతడికి ఇంతకుముందే వివాహమైందన్న విషయం తెలిసింది. దీంతో ఆమె అభిరాంచంద్ర మోసగించేందుకు యత్నించాడని కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-07-15T14:57:26+05:30 IST