‘ఐ కనెక్ట్’... డాక్టర్ అగర్వాల్ ఉచిత ఆన్‌లైన్ కన్సల్టేషన్‌...

ABN , First Publish Date - 2021-07-27T01:12:27+05:30 IST

హైదరాబాద్‌లోని ప్రముఖ కంటి ఆసుపత్రి డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ‘ఐ కనెక్ట్’ పేరుతో ఉచిత ఆన్‌లైన్ కన్సల్టేషన్ ను నిర్వహించనుంది.

‘ఐ కనెక్ట్’... డాక్టర్ అగర్వాల్ ఉచిత ఆన్‌లైన్ కన్సల్టేషన్‌...

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ప్రముఖ కంటి ఆసుపత్రి డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ‘ఐ కనెక్ట్’ పేరుతో ఉచిత ఆన్‌లైన్ కన్సల్టేషన్ ను నిర్వహించనుంది. వచ్చే నెల(ఆగస్టు) 15 వ తేదీన జరగనుంది. కోవిడ్ నేపధ్యంలో... కంటి పరీక్షలు, ఇతరత్రా చికిత్సలు అవసరమైన వారికి ఇళ్ళ దగ్గర కూడా తగిన వైద్య సలహాలివ్వనున్నారు. కాగా... సాధారణ కంటీ పరీక్షలు, ఇతరత్రా వైద్య సలహాలు కూడా అందిస్తారు. కాగా ఇది పూర్తిగా ‘ఆన్‌లైన్ కన్సల్టేషన్’ ప్రాతిపదికన జరగనుంది.


ఈ కార్యక్రమానికి సంబంధించి వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. కాగా సలహాలు అవసరమైనవారు, ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం 88791 29186 నంబరులో సంప్రదించవచ్చు, లేదా  https://www.dragarwal.com వెబ్‌సైట్ ద్వారా నిపుణుల సలహాలను పొందవచ్చు. ఇందుకోసం ఎటువంటి అప్లికేషన్‌నూ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అగర్వాల్ కంటి ఆసుపత్రి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి వచ్చే రోగులు, బాధితులకు గత కొన్నేళ్ళుగా వైద్యసేవలనందిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో... తాజాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  

Updated Date - 2021-07-27T01:12:27+05:30 IST