ఆకివీడులో దోబీఘాట్‌ కూల్చివేతపై నిరసన

ABN , First Publish Date - 2021-07-30T05:00:50+05:30 IST

కులవృత్తులను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని రజక సంఘం అధ్యక్షుడు గుళ్లపూడి పార్థసారథి విమర్శించారు.

ఆకివీడులో దోబీఘాట్‌ కూల్చివేతపై నిరసన
కూల్చివేసిన దోబీఘాట్‌ వద్ద నిరసన చేస్తున్న రజక సంఘం ప్రతినిధులు

ఆకివీడు, జూలై 29 : కులవృత్తులను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని రజక సంఘం అధ్యక్షుడు గుళ్లపూడి పార్థసారథి విమర్శించారు.  సమతానగర్‌ రోడ్‌లోని దోబీఘాట్‌ను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గురువారం ధర్నా చేశారు. మా తాతల నాటి స్థలంలో ఉన్న దోబీఘాట్‌ను కూల్చివేయడం తగదని నినాదాలు చేశారు.దోబీ ఘాట్‌ను తిరిగి నిర్మించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కుల సంఘాల నాయ కులు కలిసిరావాలన్నారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చాటపర్తి పోసిబాబు, యాసలవు రామ అప్పారావు, నరసింహారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T05:00:50+05:30 IST