జర్మనీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నారా..? అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ABN , First Publish Date - 2021-11-30T18:03:35+05:30 IST

జర్మనీలో..

జర్మనీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నారా..? అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఏం చేస్తే మంచిది?


ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌తో ఇంజనీరింగ్‌ చేస్తున్నాను. ఎంఇఎం చేయాలా లేకుంటే ఎంబీఏ చేయాలా, ఉద్యోగం చేయాలా అనే సందిగ్దంలో ఉన్నాను. విదేశాల్లో ‘మాస్టర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌’ చేస్తే ఎలా ఉంటుంది. స్కాలర్‌షిప్‌లు ఏమైనా లభిస్తాయా? వివరాలు తెలుపగలరు?

- అదితి, సికింద్రాబాద్‌

ఎంఇఎం, ఎంబీఏ రెండు కోర్సుల కాలవ్యవధి బ్రిటన్‌లో ఒక సంవత్సరం మాత్రమే. ఇతర దేశాల్లో ఇది రెండు సంవత్సరాలు. ట్యూషన్‌ ఫీజు, నివాస ఖర్చు రెండు కలిపి ఈ దేశంలో దాదాపు 20 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. కోర్సు కాలంలో లభించే స్టూడెంట్‌ వీసాతో వారానికి 20 గంటలు, సెలవుల్లో 40 గంటలు పని చేసుకోవచ్చు. చదువు తరవాత రెండు సంవత్సరాలు అక్కడ ఉండడానికి అవకాశం ఉంది.


యూకే యూనివర్సిటీల్లో చేరడానికి ఐఈఎల్‌టీఎస్‌ అకడమిక్‌ టెస్ట్‌ రాయొచ్చు. మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బంది అనిపిస్తే జర్మనీ మంచి డిస్టినేషన్‌ అవుతుంది. అక్కడ ఉన్న పబ్లిక్‌ వర్సిటీలు అన్నీ కూడా దాదాపుగా ఉచిత విద్యను అందిస్తాయి. అంతర్జాతీయ విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. నివాస ఖర్చు, ప్రయాణ ఖర్చు చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ పబ్లిక్‌ యూనివర్సిటీలన్నింటికీ డిమాండ్‌, పోటీ ఎక్కువ ఉంటుంది. మంచి అకడమిక్‌ క్రెడెన్షియల్స్‌, టోఫెల్‌లో అయితే 100 కంటే ఎక్కువ, ఐఈఎల్‌టీఎస్‌లో అయితే 6.5 కంటే ఎక్కువ, జీఆర్‌ఈలో 320 పైన ఉంటే సీటు రావడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విదేశాల్లోని చాలా వర్సిటీలు ఎంబీఏ, ఎంఈఎంను అందిస్తున్నాయి. పోస్ట్‌ వర్క్‌ స్టడీ వీసాతోపాటు, మీ ఆలోచనలు, మార్కులు, ఇతర పారామీటర్స్‌కు మేచ్‌ అయ్యే యూనివర్సిటీని, దేశాన్ని ఎంచుకోండి. 



బ్రిటన్‌ బెస్ట్‌

మా అమ్మాయి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపి ఫైనలియర్‌ చదువుతోంది. విదేశాల్లో మాస్టర్స్‌ చేయాలని అనుకుంటోంది. దీని కోసం ఏయే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అలాగే మంచి యూనివర్సిటీలను సూచించండి?

-  భవాని, పాల్వంచ

బ్యాచిలర్‌ డిగ్రీ తరవాత మాస్టర్స్‌ కోసం యూకే బాగుంటుంది. యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌, కార్డిఫ్‌ యూనివర్సిటీ, లీడ్స్‌ బెకెట్‌ యూనివర్సిటీ, లీడ్స్‌ తదితర వర్సిటీలు ఫిజియోథెరపికి పేరొందినవి. దీని కోసం ఐఈఎల్‌టీఎస్‌ అకడమిక్‌ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. 



జర్మనీలో చదవాలంటే?

నేను ప్రస్తుతం బీఈ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాను. జర్మనీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నాను. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో సలహా ఇవ్వగలరు? 

- రాహుల్‌, రామగుండం

జర్మనీలో చదువుకోవాలంటే జీఆర్‌ఈతోపాటు, టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌ల్లో ఏదో ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది. మంచి జీపీఏతోపాటు ఇతర రిక్వైర్‌మెంట్స్‌ పూర్తిచేయాల్సి ఉంది. జర్మనీ భాష వచ్చిన వారికి కొంత అడ్వాంటేజ్‌ ఉండే అవకాశం ఉంది.

- గోవర్ధనం కిరణ్‌కుమార్‌

మీక్కూడా ఏదైనా సందేహం ఉంటే సంప్రదించండి:

చిరునామా: వివరాలు ఇవిగో, కేరాఫ్‌ ఎడ్యుకేషన్‌ డెస్క్‌, ఆంధ్రజ్యోతి, ప్లాట్‌ నెం.76, రోడ్‌ నెం.70, అశ్వినీ ఎన్‌క్లేవ్‌, హుడా హైట్స్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌-500 033


Updated Date - 2021-11-30T18:03:35+05:30 IST