మీకు అర్థమవుతోందా?

ABN , First Publish Date - 2020-03-27T10:56:26+05:30 IST

కరోనా మహమ్మారి నియంత్రణకు ముందస్తు చర్యలపై గ్రామీణుల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గ్రామీణులు స్వీయ నిర్బంధం

మీకు అర్థమవుతోందా?

మా గ్రామాల్లోకి రావొద్దు

దారులను మూసివేస్తున్న ప్రజలు


ఆంధ్రజ్యోతి బృందం :

కరోనా మహమ్మారి నియంత్రణకు ముందస్తు చర్యలపై గ్రామీణుల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గ్రామీణులు స్వీయ నిర్బంధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలాచోట్ల తమ గ్రామాల్లోకి ఇతరులు రాకుండా రహదారికి అడ్డంగా కంచెలు ఏర్పాటుచేసి స్వీయ నియంత్రణ చేపట్టారు. గురువారం కూడా జిల్లాలో చాలా గ్రామాల్లో ఇతరులు ఎవరూ రాకుండా రోడ్లపై అడ్డంగా కర్రలు, ముళ్లకంచెలు ఏర్పాటుచేశారు. వంగర మండలంలో వంగర, సంగాం, రుషింగి, మడ్డువలస, వీవీఆర్‌పేట తదితర గ్రామాల్లో  ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. రాజాం పట్టణంలో పలువార్డుల యువకులతో పాటు మండలంలోని రాజయ్యపేట, వీఆర్‌ అగ్రహరం, అంతకాపల్లి, పెనుబాక, కొఠారిపురం, కంచరాం తదితర గ్రామాల్లోకి రాకుండా నిషేధాలు పెట్టారు.


సారవకోట మండలంలో కోనావానిపేట గ్రామ యువకులు గ్రామ శివారులో కంచె వేశారు. మెళియాపుట్టి మండలంలోని వెంకటాపురం, కొత్తూరు, జంతూరు, సవర కుడ్డబ, జి.సిగడాం మండలంలోని దవళపేట, మెట్టవలస, ఎచ్చెర్ల మండలంలోని దోమాం, ఫరీద్‌పేట,  టెక్కలి మండలంలోని మొఖలింగాపురం గ్రామాల్లో ఇతరులెవరూ ప్రవేశించకుండా కంచెలు వేశారు. అలాగే కోటబొమ్మాళి మండలంలో చీపుర్లపాడు, హరిశ్చంద్రపురం, దంత, కురుడు, పాకివలస, కన్నేవలస, రామయ్యపేట, జీయన్నపేట, ఊడికలపాడు, లఖందిడ్డి, గంగారాం, మూలపేట, తిలారు, తుంభయ్యపేట, పెద్దసాన, పెద్దబమ్మిడి, చిన్నబమ్మిడి, సౌడాం రహదారులకు అడ్డంగా ముళ్ల కంచెలు, బారికేడ్లు, స్టాపర్లను ఏర్పాటు చేశారు. 


అలాగే ఆమదాలవలస మండలంలో కొర్లకోట, లొద్దలపేట గ్రామాల్లో కంచెలు ఏర్పాటు చేశారు. సంతకవిటి మండలంలో సోమన్నపేట, మండాకురిటి, మిర్తివలస, మల్లయ్యపేట, కాకారాపల్లి, చిన్నయ్యపేట, సిరిపురం తదితర గ్రామాల సరిహద్దుల్లో ముళ్ల కంచెలు, తాళ్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి మా గ్రామాలకు ఎవరూ రావొద్దంటూ కోరుతున్నారు.


మందస మండలంలో హరిపురం, సిరిపురం, కొర్రాయిగేటు,మందస  కూడళ్లు, అల్లిమెరక కాలనీ, కుంటికోట, జీఆర్‌పురం, పిడిమందస, రాంపురం తదితర  గ్రామాల్లో యువకులు, వలంటీర్లు ఆధ్వర్యంలో పొలిమేరల్లో నోఎంట్రీ బోర్డులు ఏర్పాటుచేశారు. అలాగే వజ్రపుకొత్తూరు మండలంలోని సీతాపురం తదితర గ్రామాల వద్ద కంచెలతో అడ్డంగా కట్టి లోపలికి రాకుండా అడ్డుకున్నారు. సోంపేట మండలం లక్కవరంలో, హిరమండలంలోని చొర్లంగి,కల్లట,ఎం.ఎల్‌.పురం,సుబలయ ఆర్‌ఆర్‌ కాలనీ తదితర గ్రామాల్లో కంచెలు ఏర్పాటుచేశారు.

Updated Date - 2020-03-27T10:56:26+05:30 IST