ఆలయ భూములు దక్కేనా?

ABN , First Publish Date - 2021-05-06T06:37:29+05:30 IST

దేవాలయ భూముల ఆక్ర మణల వ్యవ హారం రాష్ట్రంలో మరోసా రి తెరపైకి వచ్చింది.

ఆలయ భూములు దక్కేనా?

12 ఎకరాల చెర్వుగట్టు భూములు అన్యాక్రాంతం

2014లోనే నివేదిక ఇచ్చిన ఆస్తుల విభాగం తహసీల్దార్‌

2020లో ట్రైబ్యునల్‌కు వెళ్లిన దేవస్థాన అధికారులు

నార్కట్‌పల్లి: దేవాలయ భూముల ఆక్ర మణల వ్యవ హారం  రాష్ట్రంలో మరోసా రి తెరపైకి వచ్చింది. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రా మలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెంది న సుమారు 12ఎకరాల భూమి అన్యాక్రాంతంపై ట్రైబ్యునల్‌లో విచారణ చేస్తారా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.  మేడ్చెల్‌-మల్కాజ్‌గిరి జిల్లా దేవరయాంజిల్‌లోని సీతారామచంద్ర స్వామి దేవాల య భూముల ఆక్రమణ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన నలుగురు ఐఏఎస్‌ అధికారుల జాబితాలో నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కూడా ఉన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 12 ఎకరాల భూమి అన్యాక్రాంతంపై ట్రైబ్యునల్‌లో విచారణ చేస్తారా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.  నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం రెవెన్యూ శివారు 208, 209 సర్వే నెంబర్‌లలో దేవస్థానానికి సంబంధించిన సుమారు ఎకరాల 12.23 గుంటల భూమి అన్యాక్రాంతమైందని ఇదే గ్రామానికి చెందిన రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఎండోమెంట్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అప్పటి జాయింట్‌ కమిషనర్‌ సదరు ఆక్రమణల ఫిర్యాదులపై విచారణ చేయాలని దేవదాయ, ధర్మాదాయ ఆస్తుల విభాగం తహసీల్దార్‌ ఏ.నిర్మలను ఆదేశించారు. సదరు అధికారి నార్కట్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు, దేవస్థానం భూములకు సంబంధించిన ముంతకాబ్‌ ప్రతిని, సెక్షన్‌ 43 (10) రిజిష్టర్‌లను పరిశీలించి 2014 సంవత్సరం జనవరి 6వ తేదీన నివేదిక తయారు చేశారు.  

పట్టాగా మారిన ఖిద్మత్‌ ఇనాం భూములు 

208, 209 సర్వేలలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 1954-56 సం వత్సర పహణీలో ఖిద్మత్‌ ఇనాం కింద పేర్కొన్న ఎ.12.23గుంటల విస్తీర్ణంగా గ ల ఈ భూ ములు క్రమంగా పట్టా భూములుగా మారినట్లు గుర్తించారు. పట్టాదారుడిగా దేవర్‌ రామలింగేశ్వరస్వామి అనుభవదారులుగా అర్చకుల పేర్లు ఉన్న ఈ భూములు ప్రైవేట్‌ పట్టాదారుల చేతుల్లోకి వెళ్లాయి. 1956- 58 చెస్సాల్‌ పహాణీలోని ఇవే సర్వే నెంబర్‌లలో గల భూమి పట్టాదారు, అనుభవదారుల స్థానంలోనూ అర్చకులే నమోదయ్యారు. కానీ 1960-61 పహణీ లో మాత్రం ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట ఈ భూ ముల పట్టా మార్పిడి జరగడంతో 1989-90 పహణీలో ఖిద్మత్‌ ఇనాం భూముల స్వభావ కాలంలో పట్టా భూమిగా నమోదు కాగా చివరకు 2009-10 సంవత్సర పహణీలోని పట్టాదారు కాలంలో ఈ భూముల్లో పరిశ్రమలు, వెంచర్లు వచ్చి చేరినట్లు 

ఎండోమెంట్‌ తహసీల్దార్‌ నిర్మల విచారణలో గుర్తించారు. 

ట్రైబ్యునల్‌కు వెళ్లాలని సూచన 

దేవాలయానికి చెందిన భూములు పట్టా భూములుగా ఏ ఆధారాలతో మార్పిడి చేశారన్న దానిపై స్థానిక రెవెన్యూ తహసీల్దార్‌, నల్లగొండ ఆర్‌డీవోను సంప్రదించి నివేదిక కోరవచ్చని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ఇనాం రద్దు (తెలంగాణ ప్రాంతం) సవరణ చట్టం 1994 సెక్షన్‌(4) ప్రకారం దేవాదాయ భూమిలో కాస్తుదారినిగా దేవతామూర్తుల పేర్లు నమోదు చేయాల్సి ఉంది. ఒకవేళ ఆ భూములను సాగు చేస్తున్న వారి  పేర్లను కూడా అనుభవ/కాస్తుదారుని కాలంలో నమోదు చేయడానికి వీలులేదని చెప్పారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్‌డీవోను సంప్రదించవచ్చ ని సూచించారు. పై రెండు సర్వే నెంబర్‌లలోని సదరు విస్తీర్ణాన్ని దేవాలయానికి స్వాధీనపర్చేందుకు వీలుగా హిందూ ధార్మిక, దేవదాయ, ధర్మాదాయ చట్టం 1987 సెక్షన్‌ 83 కింద దేవదాయశాఖ ట్రైబ్యునల్‌లో కేసు వేయడానికి సదరు దేవస్థాన ఈవోకు సూచించమని 2014 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన సంయుక్త కమిషనర్‌ ఎండోమెంట్‌కు ఇచ్చిన నివేదిక లో తహసీల్దార్‌ నిర్మల పేర్కొన్నారు. 2019 వరకు కూడా ట్రిబ్యునల్‌కు వెళ్లనట్లు సమాచారం.

Updated Date - 2021-05-06T06:37:29+05:30 IST