నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం.. జనవరి 9న జరుపుకోవడానికి కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-01-09T13:54:50+05:30 IST

భారతదేశ అభివృద్ధికి విదేశాల్లో ఉన్న భారతీయుల సహకారాన్ని, వారి ప్రాధాన్యాన్ని గుర్తించి గౌరవించుకోవడానికే ప్రతి ఏటా ‘ప్రవాస భారతీయుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. 1915లో దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ ముంబైకి తిరిగి వచ్చిన జనవరి 9న ఈ వేడుక నిర్వహిస్తున్నాం. 2003 నుంచి ఏటా ఒక భారతీయ నగరంలో నిర్వహిస్తూ వస్తున్నారు.

నేడు ప్రవాస భారతీయుల దినోత్సవం.. జనవరి 9న జరుపుకోవడానికి కారణమేంటంటే..

ప్రవాస భారతీయుల నైపుణ్యాలు, సేవలు భారత దేశం వచ్చేలా ప్రోత్సహించాలి. అందుకు తగ్గ పరిస్థితులను కల్పించాలి. అప్పుడే విదేశాల్లోని మన వారి కృషి ఫలితాన్ని మనం పొందగలం. అందుకని, మన దేశ విదేశీ వ్యవహారాలలో ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది.


భారతదేశ అభివృద్ధికి విదేశాల్లో ఉన్న భారతీయుల సహకారాన్ని, వారి ప్రాధాన్యాన్ని గుర్తించి గౌరవించుకోవడానికే ప్రతి ఏటా ‘ప్రవాస భారతీయుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. 1915లో దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ ముంబైకి తిరిగి వచ్చిన జనవరి 9న ఈ వేడుక నిర్వహిస్తున్నాం. 2003 నుంచి ఏటా ఒక భారతీయ నగరంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రశంసనీయమైన కృషి చేసిన ప్రవాస భారతీయులకు భారత రాష్ట్రపతి 'ప్రవాసీ భారతీయ సమ్మాన్' పురస్కారాలను అందజేస్తారు.

 

1990వ దశకంలో సాఫ్ట్‌వేర్ రంగ విజృంభణ, అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి అనేక మంది భారతీయులను ఆకర్షించింది. ఫలితంగా అనేక మంది భారతీయులు ఆ దేశానికి వలస వెళ్లారు. ప్రస్తుతం భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశాల్లో అమెరికా మూడో స్థానంలో ఉంది. వివిధ కారణాల వల్ల ఇలా వలస వెళ్లిన వారు (ప్రవాస భారతీయులు), ఆయా దేశాల్లో స్థిరపడిన భారత సంతతి వారు అందరూ కలిసి దాదాపు 30 మిలియన్ల వరకూ వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. కానీ, ప్రవాస భారతీయులను ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా చేయడంలో మాత్రం దేశీయంగా ఇంకా మెరుగైన పరిస్థితులు కల్పించలేక పోతున్నాం.

 

ఈ ప్రవాస భారతీయులు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. కొందరైతే ఆయా దేశాల్లో కీలకమైన పదవులు, స్థాయిల్లో ఉన్నారు. వారి నైపుణ్యాలు, సేవలు భారత దేశం వచ్చేలా ప్రోత్సహించాలి. అందుకు తగ్గ పరిస్థితులను కల్పించాలి. అప్పుడే మన వారి కృషి ఫలితాన్ని మనం పొందగలం. అందుకని, మన దేశ విదేశీ వ్యవహారాలలో మార్పులు ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రవాసీలు వారికి అనువైన సమయంలో, వారికి అనువైన రీతిలో మనకు సేవలందించేటందుకు విదేశీ విధానాలు, వ్యవహారాలు కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. వీటి కోసం నిర్ధిష్టమైన ప్రణాళికలు రూపొందించాలి. దీని ద్వారా భారత దేశంలో సామాజిక, విద్య , వైద్య, సదుపాయాలు, మౌలిక సౌకర్యాలు మెరుగు పడతాయి. ఆర్థికంగా కూడా దేశం అభివృద్ధి చెందుతుంది. 

Updated Date - 2022-01-09T13:54:50+05:30 IST