వేరొకరి భార్యను అద్దెకు తెచ్చుకోవచ్చు.. స్టాంప్ పేపర్‌పై అగ్రిమెంట్ కూడా.. అక్కడ ఎన్నో ఏళ్లుగా కనీవినీ ఎరుగని వింత ఆచారం..!

ABN , First Publish Date - 2021-11-11T00:14:46+05:30 IST

మరొకరి భార్యను వక్రదృష్టితో చూడటమే తప్పు. మన దేశంలో ఇలాంటి చర్యలు.. చట్ట వ్యతిరేకం. ఇలాంటి విచిత్ర ఆచారాలు విదేశాల్లో ఉంటాయని వింటూ ఉంటాం. మన దేశంలో మాత్రం అసాధ్యమని భావిస్తాం. కానీ

వేరొకరి భార్యను అద్దెకు తెచ్చుకోవచ్చు.. స్టాంప్ పేపర్‌పై అగ్రిమెంట్ కూడా.. అక్కడ ఎన్నో ఏళ్లుగా కనీవినీ ఎరుగని వింత ఆచారం..!
ప్రతీకాత్మక చిత్రం

మరొకరి భార్యను వక్రదృష్టితో చూడటమే తప్పు. మన దేశంలో ఇలాంటి చర్యలు.. చట్ట వ్యతిరేకం. ఇలాంటి విచిత్ర ఆచారాలు విదేశాల్లో ఉంటాయని వింటూ ఉంటాం. మన దేశంలో మాత్రం అసాధ్యమని భావిస్తాం. కానీ ఇలా వేరే వాళ్లను అద్దెకు తీసుకునే సంప్రదాయం ఎక్కడో కాదు.. మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో ఇప్పటికీ కొనసాగుతోంది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది మాత్రం అక్షరాలా నిజం. స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకుని మరీ.. భార్యను వేరే వాళ్లకు అప్పగిస్తారు. తద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. కనీవినీ ఎరుగని ఈ వింత ఆచారానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఈ సంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ధడిచా అని పిలువబడే ఈ సంప్రదాయం ప్రకారం.. జీవిత భాగస్వామి కావాలనుకునే ధనవంతులు.. డబ్బులు అవసరమైన వారి నుంచి అగ్రిమెంట్ చేసుకుని, వారి భార్యలను తీసుకెళ్తుంటారు. నెల లేదా సంవత్సరం.. ఇలా వారి వారి అవసరాల మేరకు ఒప్పందం చేసుకుంటారు. తర్వాత ఎవరి భార్యను వారికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ మేరకు రూ.10 లేదా రూ.100ల స్టాంపులపై సంతకాలు చేసుకుంటారు. ఇలా వెళ్లిన మహిళ.. వేరే వారికి భార్యగా ఉండాలి. మానసికంగా, శారీరకంగా వారితో భార్యలాగానే ప్రవర్తించాలి. వారి కుటుంబ బాధ్యతల్లో కూడా పాలు పంచుకోవాలి. వయసు తక్కువ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. పెళ్లి కాని వారిని అద్దెకు తీసుకున్న సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో ముట్టచెబుతుంటారట.


ఇలాంటి సంప్రదాయమే.. గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా నడుస్తోంది. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తన భార్యను సంపన్న కుటుంబానికి నెల రోజులు అద్దెకు ఇచ్చాడట. తన నెల సంపాదన కంటే మూడు రెట్లు అధికంగా డబ్బులు తీసుకున్నాడు. గుజరాత్-మధ్యప్రదేశ్ ప్రాంతంలోని చాలా గ్రామాల్లో దీన్ని వ్యాపారంగా భావిస్తారు. రూ.500 నుంచి లక్ష రూపాయల లోపు ఒప్పందం నడుస్తూ ఉంటుందట. పిల్లలను అద్దెకు పంపించే క్రమంలో వారు ఆకర్షణీయంగా కనిపించేలా తల్లిదండ్రులే స్వయంగా జాగ్రత్తలు తీసుకుంటారట. దీనికి మధ్యవర్తులు కూడా ఉంటారు. మహిళలు అవసరమైన వారు.. మధ్యవర్తులను సంప్రదిస్తుంటారు.


ఇలా వెళ్లిన క్రమంలో కొన్నిసార్లు మహిళలు, బాలికలు చిత్రహింసలకు గురవుతుంటారు. అయితే తల్లిదండ్రులు కానీ, పంపించిన భర్త కానీ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. దీంతో చాలామంది తమ బాధను లోలోపలే దిగమింగుకుంటూ చిత్రహింసలను అనుభవిస్తుంటారు. చాలా సందర్భాల్లో పోలీసులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించినా .. వారిలో మాత్రం మార్పు రావడం లేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుందట. ఇలాంటి ఆచారాన్ని మన దేశంలోనే కాకుండా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో కూడా పాటిస్తున్నారు.

Updated Date - 2021-11-11T00:14:46+05:30 IST