Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 24 Jun 2022 21:40:43 IST

Viral Video: పాముతో చెలగాటం ఆటాడు.. చివరికి చుక్కలు చూపించింది.. ఏం జరిగిందో మీరే చూడండి..

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: పాముతో చెలగాటం ఆటాడు.. చివరికి చుక్కలు చూపించింది.. ఏం జరిగిందో మీరే చూడండి..

పాములను చూడడమే ఆలస్యం.. వెంటనే కాళ్లకు బుద్ధి చెబుతాం. అయితే కొందరు మాత్రం వాటిని చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిపెడుతుంటారు. ఈ విషయం పక్కనపెడితే.. పాముతో చెలగాటం ఆడాలని ఎవరికీ ఉండదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. అదే పని చేశాడు. అందరి ముందు హీరో అవుదాం అనుకున్నాడు. చివరికి పాము అతడికి చుక్కలు చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ సభ లాంటి ప్రదేశంలో చాలా మంది జనం కుర్చీల్లో కూర్చుని ఉంటారు. ఆ సమయంలో ఓ పాము అక్కడికి వస్తుంది. ఇంకేముందీ.. దాన్ని చూసి అంతా భయపడిపోతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం.. అందరి ముందు హీరో అవుదామని దాని వద్దకు వెళ్తాడు. తోక పట్టుకుని చెలగాటం ఆడాలని చూశాడు. అయితే రెండో ప్రయత్నం చేయగానే.. పాముకు విపరీతమైన కోపం వచ్చినట్టుంది. వెంటనే బుసలు కొడుతూ అతడి ప్రైవేట్ పార్ట్ వద్ద గట్టిగా పట్టుకుంటుంది. వామ్మో అంటూ.. కేకలు పెడుతూ దాని నుంచి విడిపించుకోవడానికి అతను శతవిధాలా ప్రయత్నిస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. సరైన శిక్షణ లేకుండా పామును పట్టుకోవడానికి వెళ్లిన ఆ వ్యక్తికి బుద్ధి వచ్చేలా.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు.. విష సర్పాలతో జాగ్రత్త తమ్ముడూ.. అంటూ సలహా ఇస్తున్నారు.

తగ్గేదేలే.. అంటున్న యువతి.. గుర్రంతో పోటి పడి మరీ స్కేటింగ్...



ఇవి కూడా చదవండిLatest News in Telugu

న్యాయం చేయండంటూ రెండు చేతులూ లేని బాలిక కాళ్లతో రాసిందో లేఖ.. నేరుగా ఇంటికే వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..40 ఏళ్ల వయసులో ఇదేం పోయేకాలం.. 14 ఏళ్ల బాలిక తండ్రికి రూ.30 వేలు ఇచ్చిమరీ..సద్గురు జగ్గీ వాసుదేవ్ నోట.. గంగవ్వ మాట.. మట్టి ప్రాముఖ్యత తెలియజేస్తూ... ఆయన ఏమన్నారంటే..videoతల్లి ఫోన్లో వీడియోను చూసి తానూ అలా చేయాలనుకున్నాడు.. పదేళ్ల పిల్లాడి మృతి కేసులో షాకింగ్ నిజాలు..!AIDS ఉన్న విషయం దాచి ఓ యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే..కాటికి కాళ్లు చాపే వయసులో జిమ్మాస్టర్‌గా ఘనత.. త్వరలో "మిస్టర్ ఆసియా" పోటీల్లో పాల్గొంటున్న ఆ 72 ఏళ్ల వ్యక్తి ఎవరో తెలుసా..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.