కార్ల షోరూంలో రైతుకు అవమానం.. దాంతో చివరకు షోరూం వారికి ఎలా బుద్ధి చెప్పాడో తెలిస్తే.. శభాష్ అనకుండా ఉండలేరు!

ABN , First Publish Date - 2022-01-24T01:06:01+05:30 IST

అహం దెబ్బతింటే కొందరు ఎంతవరకైనా వెళ్తారు. అందులో ఆత్మాభిమానం ఉన్నవారైతే ఇంకా చాలా దూరం వెళ్తారు. కర్ణాటకలో ఇలాగే ఓ రైతుకు అహం దెబ్బతింది. స్నేహితులతో కలిసి కార్ల షోరూంకి వెళ్లిన ఆయన్ను ఓ సేల్స్‌మ్యాన్..

కార్ల షోరూంలో రైతుకు అవమానం.. దాంతో చివరకు షోరూం వారికి ఎలా బుద్ధి చెప్పాడో తెలిస్తే.. శభాష్ అనకుండా ఉండలేరు!

అహం దెబ్బతింటే కొందరు ఎంతవరకైనా వెళ్తారు. అందులో ఆత్మాభిమానం ఉన్నవారైతే ఇంకా చాలా దూరం వెళ్తారు. కర్ణాటకలో ఇలాగే ఓ రైతుకు అహం దెబ్బతింది. స్నేహితులతో కలిసి కార్ల షోరూంకి వెళ్లిన ఆయన్ను ఓ  సేల్స్‌మ్యాన్ హేళన చేశాడు. ‘‘కూలి పనులు చేసుకునే వారు కార్ల షోరూంకి రావడమేంటీ.. కార్లేమన్నా రూపాయి, రెండు రూపాయలు అనుకున్నారా’’..  అని అనడంతో రైతుకు కోపం నశాలానికి అంటింది. తర్వాత అతడు చేసిన పనికి షోరూం నిర్వాహకులు షాక్ తిన్నారు. ఏం జరిగిందంటే..


కర్ణాటకలోని తుముకూర్​లో ఉన్న మహీంద్రా షోరూంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బొలేరో వాహనం కొనేందుకు ఓ రైతు తన స్నేహితులను తీసుకుని షోరూంకి వెళ్లాడు. స్వతహాగా రైతు కావడంతో దుస్తుల విషయంలో పట్టింపులు లేకుండా సాదాసీదాగా వెళ్లాడు. మామూలు దుస్తులతోనే షోరూంలోకి వెళ్లాడు. అక్కడున్న కార్లను పరిశీలిస్తుండగా.. ఓ సేల్స్‌మ్యాన్ అక్కడికి వచ్చి వారిని వారించాడు. ‘‘ కూలి పనులు చేసుకునే వాళ్లు కార్ల షోరూంకి రావడమేంటీ.. బయటికి వెళ్లండి.. కార్లేమన్నా రూపాయి, పది రూపాయలు అనుకున్నారా.. వాటిని తాకొద్దు’’.. అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో సదరు రైతుకు కోపం కట్టలు తెంచుకుంది.

టాయిలెట్‌ నుంచి శబ్ధాలు వస్తున్నాయని పక్కింటి వారిపై కోర్టులో కేసు.. 19 ఏళ్ల తర్వాత ఎలాంటి తీర్పు వచ్చిందో తెలుసా..


గంట వ్యవధిలో రూ.10లక్షలు ఒకేసారి వారి ముందు పెట్టి, వెంటనే కారు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఊహించని ఘటనతో  సేల్స్‌మ్యాన్‌తో పాటూ షోరూంలోని సిబ్బంది అవాక్కయ్యారు. రైతు అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో షోరూం సిబ్బందితో పాటూ, నిర్వాహకులంతా రైతుకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి సర్దిచెప్పి పంపించారు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.

వేగంగా వెళ్తున్న రెండు ట్రైన్ల మధ్య.. అంతే వేగంగా పరుగెడుతున్న గుర్రం.. సినిమా కాదు.. రియల్..

Updated Date - 2022-01-24T01:06:01+05:30 IST