అక్కడ టాటూ వేశాక ఏం జరిగింది..?

ABN , First Publish Date - 2022-05-28T22:39:31+05:30 IST

టాటూ వేయించుకోవడమంటే అంటే అబ్బాయిలు, అమ్మాయిలకు చెప్పలేనంత ఇష్టం. శరీరంలో తమకు ఇష్టమైన భాగంలో నచ్చిన టాటూలు వేయించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు..

అక్కడ టాటూ వేశాక ఏం జరిగింది..?

టాటూ వేయించుకోవడమంటే అంటే అబ్బాయిలు, అమ్మాయిలకు చెప్పలేనంత ఇష్టం. శరీరంలో తమకు ఇష్టమైన భాగంలో నచ్చిన టాటూలు వేయించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అయితే టాటూ వేయించుకునే సమయంలో భరింత లేనంత నొప్పి పుట్టినా దాన్ని భరిస్తుంటారు. అయితే, శరీరంలో ఏ పార్ట్‌పై టాటూ వేసుకుంటే నొప్పి ఎక్కువగా ఉంటుందో మీకు తెలుసా..? ఇదే విషయాన్ని 848 స్వ్కేర్ టాటూలు వేసుకుని గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకెక్కిన మాట్‌గాన్‌ వివరించాడు. ముక్కుపై టాటూ వేసుకునేట‌ప్పుడు తాను ఎక్కువగా బాధ‌ప‌డిన‌ట్లు వెల్లడించాడు. 2014లో అత్యధిక టాటూలు వేసుకున్న వ్యక్తిగా మాట్‌గాన్‌ గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు సాధించాడు.


ఇటీవల  త‌న టాటూ అనుభ‌వాల‌ను వెల్లడించాడు. ముక్కులో టాటూ వేయించుకున్నాక 20 నిమిషాల‌ పాటు తుమ్మితే బ్లాక్ ఇంక్ వ‌చ్చేద‌ని చెప్పాడు. ఇది తాను అనుభ‌వించిన అత్యంత బాధాక‌ర‌మైన విష‌యమని చెప్పాడు. మాట్‌గాన్‌ తన నాలుకపై, కనుబొమ్మలపై కూడా టాటూలు వేయించుకున్నాడు. మ‌త్తుమందు ఇచ్చినా క‌నురెప్ప లోప‌ల ప‌చ్చబొట్టు వేసుకునేట‌ప్పుడు చాలా నొప్పి ఉంటుంద‌ని వివరించాడు. కనుబొమ్మలపై పచ్చబొట్టు వేయించుకున్న ప్రపంచంలో ఆరో వ్యక్తి తానేన‌ని తెలిపాడు.

ఆవు పేడను ఇలా కూడా వాడొచ్చా.. ఇటుకలు తయారు చేసి, లక్షలు సంపాదిస్తున్న లెక్చరర్‌.. ఇంతకీ అది ఎలాగంటే..



Updated Date - 2022-05-28T22:39:31+05:30 IST