Abn logo
Sep 25 2021 @ 01:56AM

ఇవి తెలుసా? జీమెయిల్‌ టిప్స్‌

ప్రపంచంలోనే అత్యధికులు ఉపయోగించే నెట్‌వర్క్‌ జీమెయిల్‌. ఈ ఏడాది ఆరంభంలోనే యూజర్లు ఒకటిన్నర బిలియన్లు అంటే దానికి ఉన్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. పదిహేడేళ్ళుగా అనేకానేక కొత్త ఫీచర్లను జీమెయిల్‌ జత చేసింది. అయితే ఇది అందిస్తున్న కొన్ని ఫీచర్లు అందరికీ తెలుసా అన్నది అనుమానమే సుమా!


నే
రుగా మనకునష్టం కలిగించనప్పటికీ జీమెయిల్‌లో వచ్చే కొన్ని మెసేజ్‌లు సతాయిస్తూ ఉంటాయి. ఈ ఈమెయిల్‌ థ్రెడ్‌(మెసేజ్‌లు, రెస్పాన్స్‌లతో కూడిన చైన్‌ లేదా గొలుసుకట్టు) చికాకు పరుస్తూ ఉంటుంది. అయితే దీన్ని మ్యూట్‌లో పెట్టే సౌలభ్యం జీమెయిల్‌లో ఉంది. వాటినుంచి వెసులుబాటుకు ‘మ్యూట్‌’ ఆప్షన్‌ ఉంది. దీని కోసం సదరు మెయిల్‌ను   మొదట ఓపెన్‌ చేయాలి. మూడు డాట్స్‌ను టాప్‌ చేయాలి. దాన్నుంచి మ్యూట్‌ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాలి. దీంతో సంభాషణ కాస్తా ఆర్కైవ్‌లోకి వెళుతుంది. కొత్త సమాధానం కూడా అక్కడికే చేరుతుంది. ఎప్పుడైనా చూసుకోవాలని అనుకుంటే, ఆర్కైవ్‌లోకి వెళ్ళి అన్‌మ్యూట్‌ చేస్తే సరిపోతుంది. 


ప్రతి మెసేజ్‌ని చెక్‌ చేసి డిలీట్‌ చేయడం నిజానికి తలనొప్పి వ్యవహారం. అయితే ఆటో అడ్వాన్స్‌ ఫీచర్‌తో ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు. ఈ పద్ధతిలో పాత, కొత్త అన్న సంబంధం లేకుండా ఆటోమెటిక్‌గా తరవాతి మెసేజ్‌ దగ్గరకు వెళ్ళవచ్చు. ఆర్కైవ్డ్‌ లేదంటే మ్యూట్‌ చేసి తరవాత వాటిని చూపిస్తాయన్న మాట. ఇందుకోసం సెట్టింగ్స్‌ - అడ్వాన్స్‌డ్‌ - ఎనేబుల్‌ ఆటో అడ్వాన్స్‌ - సేవ్‌ చేంజెస్‌. మళ్ళీ తిరిగి - సెట్టింగ్స్‌ - జనరల్‌ - స్ర్కోల్‌ డౌన్‌ టు ఆటో అడ్వాన్స్‌ - మరొక సంభాషణ ఎంపిక - సేవ్‌ చేంజెస్‌ చేయాలి


25 ఎంబి ఫుల్‌ సైజ్‌ అటాచ్‌మెంట్లను సైతం పంపుకొనే వీలును   జీమెయిల్‌ కల్పిస్తోంది. అయితే గూగుల్‌ డ్రైవ్‌ను ఉపయోగించుకోవాలి. అటాచ్‌మెంట్‌ను మొదట గూగుల్‌ డ్రైవ్‌కు అప్‌లోడ్‌ చేసుకోవాలి. తదుపరి కంపోజ్‌ సెక్షన్‌లో డ్రైవ్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి, ఫైల్‌ అటాచ్‌ చేస్తే సరిపోతుంది. 


కాంప్రహెన్సివ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ మరో ఆప్షన్‌. దీంతో సెర్చ్‌ని కస్టమైజ్‌ చేసుకోవచ్చు. సెండర్‌, రిసీవర్‌, కీవర్డ్‌ ఇలా చాలా విధాలుగా సెర్చ్‌ చేయవచ్చు. ఇందుకోసం సెట్టింగ్‌ ఐకాన్‌పై సెర్చ్‌బార్‌ రైట్‌ సైడ్‌ క్లిక్‌ చేయాలి. 


పంపిన మెయిల్‌ను అయిదు సెకెండ్లలో వెనక్కు తీసుకునే ఆప్షన్‌ ఇంతకుమునుపు ఉండేది. ఇప్పుడు దీన్ని 30 సెకెండ్లకు పెంచుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌ - జనరల్‌ - అన్‌ డు సెండ్‌ - డ్రాప్‌ డౌన్‌ మెనూ నుంచి 30 సెకెండ్ల ఆప్షన్‌ తీసుకోవాలి. ఈ పరిమితిని 20, 10 సెకెండ్లకు కూడా పెట్టుకోవచ్చు. 


నడ్జస్‌ మరో ఫీచర్‌. ముఖ్యమైన మెయిల్స్‌ను ఇది రిమైండ్‌ చేస్తుంది. రిప్లయ్‌ ఇచ్చేందుకు వీలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీని కోసం సెట్టింగ్స్‌ - జనరల్‌ - నడ్జెస్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. సజెస్ట్‌ ఈ మెయిల్స్‌ టు రిప్లయ్‌, సజెస్ట్‌ ఈ మెయిల్స్‌ టు ఫాలోఅప్‌ అని ఉంటాయి. అవసరం అనుకుంటే రెంటినీ ఎనేబుల్‌ చేసుకోవచ్చు. 


ఈ మెయిల్‌ షెడ్యూలింగ్‌ ఫీచర్‌ కూడా ఉంది. కంపోజింగ్‌ చేసుకున్న ఫైల్‌ను ఎప్పడైనా పంపించుకునే సౌలభ్యం ఇందులో ఉంటుంది. ఇందులో భాగంగా ముందు ఈమెయిల్‌ను కంపోజ్‌ చేసుకోవాలి. సెండ్‌ బటన్‌ కింద ఉన్న యారోని టాప్‌ చేయాలి. అందులో షెడ్యూల్‌ సెండ్‌ని ఎంపిక చేసుకోవాలి. డేట్‌, టైమ్‌ కూడా ఎంచుకుని ప్రిసెట్‌ చేయాలి. లేదంటే సొంతంగానే డేట్‌, టైమ్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేసుకోవాలి. 


స్మార్ట్‌ కంపోజ్‌ ఫీచర్‌ మరొకటి. ఈమెయిల్‌ను వేగంగా రాసుకునేందుకు దీన్ని ఉద్దేశించారు. మెషీన్‌ లెర్నింగ్‌ సహాయంతో ఇది పనిచేస్తుంది. ఇది గూగుల్‌ లెవెల్‌ సెట్టింగ్‌ అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఏ డివైస్‌ మీదైనా దీన్ని పొందవచ్చు. సెట్టింగ్స్‌ - జనరల్‌ - స్మార్ట్‌ కంపోజ్‌తో ఎనేబుల్‌ చేసుకోవచ్చు. 


జీమెయిల్‌ నుంచి నేరుగా టాస్క్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఈమెయిల్‌పై రైట్‌ క్లిక్‌తో పనవుతుంది. క్లిక్‌ చేసిన తరవాత యాడ్‌ ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి. 


కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌ అనేది అదనపు సెక్యూరిటీ కింద లెక్క. ఈమెయిల్‌, అటాచ్‌మెంట్‌లు మరొకరి అందుబాటులోకి రాకుండా కాపాడుకోవచ్చు. ఈ మోడ్‌తో ఎక్స్‌పైరీ డేట్‌ ఫిక్స్‌ చేసుకోవచ్చు. పాస్‌కోడ్‌ సెట్‌ చేసి కూడా ఇలాంటివాటిని పంపుకోవచ్చు. దీనికోసం కాన్ఫిడెన్షియల్‌ ఐకాన్‌పై క్లాక్‌ అండ్‌ లాక్‌ ఐకాన్‌తో క్లిక్‌ చేయాలి. ఎక్స్‌పైరీ డేట్‌, ఎస్‌ఎంఎస్‌ పాస్‌కోడ్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి. ఎక్స్‌పైరీ డేట్‌ను ఒకటి నుంచి ఐదేళ్ళకు పెట్టుకోవచ్చు. 


ఆఫ్‌లైన్‌లోనూ జీమెయిల్‌ యాక్సెస్‌ పొందవచ్చు. అంటే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండానే యాక్సెస్‌ పొందవచ్చని అర్థం చేసుకోవాలి. బుక్‌మార్క్‌మెయిల్‌.గూగుల్‌.కామ్‌ను ఇందుకోసం ఎనేబుల్‌ చేసుకోవాలి. క్రోమ్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. సెట్టింగ్స్‌ ఓపెన్‌ - ఆఫ్‌లైన్‌ - ఎనేబుల్‌ ఆఫ్‌లైన్‌ మెయిల్‌.


జీ మెయిల్‌ అటాచ్‌మెంట్స్‌ను నేరుగా గూగుల్‌ డ్రైవ్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. అటాచ్‌మెంట్‌ సెక్షన్‌కు స్ర్కోల్‌డౌన్‌ చేసుకుని, డౌన్‌లోడ్‌ ఐకాన్‌కు బదులుగా డ్రైవ్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. 


జీ మెయిల్‌ అకౌంట్‌లోనూ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌ పనిచేస్తుంది. ఈమెయిల్‌ ఆసాంతం అనువదించుకోవచ్చు. మొదట ఈమెయిల్‌ను ఓపెన్‌ చేసుకోవాలి. కుడివైపు ఎగువన ఉన్న మూడు చుక్కలను క్లిక్‌ చేయాలి. ట్రాన్స్‌లేట్‌ మెసేజ్‌ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాలి. మెయిల్‌పై కొత్త బార్‌ ఓపెన్‌ అవుతుంది. దాన్నుంచి కావాల్సిన లాంగ్వేజ్‌ని ఎంపిక చేసుకోవాలి.

 

బాక్స్‌లో ఆర్గనైజ్‌ చేసేటప్పుడు ఫోల్డర్ల కంటే లేబుల్స్‌ బాగా ఉంటాయి. ఫోల్డర్ల లాగానే పనిచేస్తాయి. మల్టిపుల్‌ లేబుల్స్‌ ఉపయోగించుకోవచ్చు. దీంతో ఈమెయిల్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ కూడా సులువుగా ఉంటుంది. టాస్క్‌ను బట్టి ‘ఇన్‌ ప్రాసెస్‌’ ‘డన్‌’ పేరుతో ప్రత్యేకించుకోవచ్చు. 


జీమెయిల్‌ రీడింగ్‌ పేన్‌ను ఉపయోగించుకోవాలి. దీంతో రీడింగ్‌, రిప్లయింగ్‌ సమయంలోనూ బాక్స్‌ వీక్షణకు అవకాశం ఉంటుంది. దీని కోసం అప్పర్‌ రైట్‌ కార్నర్‌లో గేర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. రీడింగ్‌ పేన్‌ దగ్గరకి స్ర్కోలింగ్‌ డౌన్‌ చేసుకురావాలి. మల్టిపుల్‌ లే ఔట్స్‌ మధ్య ఎంపిక జరగాలి. రికమెండ్‌ చేసినవి బాక్స్‌కు కుడిపక్క లేదా దిగువన ఉండాలి.