Advertisement
Advertisement
Abn logo
Advertisement

కండోమ్స్ నుంచి కాఫీ వరకు.. ఏకంగా ఇన్ని ఆంక్షలా..? వింత చట్టాల ఉత్తరకొరియా..!

ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్. ఆయనపై వచ్చినన్ని పుకార్లు, వార్తలు ఇతర ఏ దేశాధినేతపైనా రాలేదు. తాజాగా ఆయన బరువు తగ్గారంటూ వార్తలు వస్తున్నాయి. దానితోపాటే ఆయన ఆరోగ్యంపైనా కూడా ఆ వార్తలు అనుమానాలను క్రియేట్ చేస్తున్నాయి. గతంలోనూ ఆయనకు ఉన్న ఊబకాయం సమస్యను పేర్కొంటూ ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు షికార్లు చేశాయి. కిమ్ జాంగ్ ఉన్ మరణించారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ కిమ్ జాంగ్ మీడియా ముందు కనిపిస్తుంటారు. అసలు ఇంతలా ప్రచారం జరగడానికి కారణం కిమ్ జాంగ్ వైఖరితోపాటు ఆ దేశంలో ఉన్న నియమ నిబంధనలే కారణం. కఠిన చట్టాలను అమలు చేసే ఉత్తర కొరియాలో ప్రపంచంలో మరెక్కడా కనిపించని వింత వింత ఆంక్షలు కనిపిస్తుంటాయి. మరి అవేంటో ఓ లుక్కేయండి. 


1. పాశ్చాత్య ఫ్యాషన్

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మినీ స్కర్టులు, జీన్స్ వంటి పాశ్చాత్య ఫ్యాషన్ కనబడుతుంది. కానీ ఉత్తర కొరియా వెళ్తే భూతద్దంతో వెతికినా అంత మోడ్రన్ ఫ్యాషన్ కనిపించదు. ఇక్కడ వేసుకునే దుస్తులను పరిశీలించడానికి ఫ్యాషన్ పోలీసులు కూడా ఉంటారు. తాజాగా చైనాతో సరిహద్దు పంచుకునే రెండు ప్రాంతాల్లో కూడా జీన్స్‌, మిగతా మోడ్రన్ దుస్తులపై నిషేధం విధిస్తున్నట్లు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు.


2. కోకా కోలా

ప్రపంచంలో అత్యధికులు తాగే కూల్‌డ్రింకులు కోకా కోలా కంపెనీవే. అయితే ఈ కంపెనీపై ఉత్తర కొరియాలో బ్యాన్ ఉంది. దీంతో ఇక్కడ కోక్ తాగడం అసాధ్యం. కానీ ప్యాంగ్యాంగ్‌లోని కొన్ని షాపులు మాత్రం చైనాలో తయారైన కోక్ అమ్ముతాయట.

3. హెయిర్ కట్

మనం ఒక్కసారి హెయిర్ సెలూన్‌కు వెళ్తే.. ఆ స్టైల్ కావాలి, లేకపోతే ఈ స్టైల్ బాగుంటుందా అంటూ ఆలోచిస్తూనే అరగంట గడిపేస్తాం. కానీ నార్త్ కొరియాలో ఆ పప్పులు ఉడకవు. ఇక్కడ అబ్బాయిలకు 15 రకాలు, అమ్మాయిలకు 18 రకాల హెయిర్ స్టైల్స్‌ను మాత్రమే కిమ్ జాంగ్ ఉన్ అనుమతించారు. అంతేకాదు, ఏ హెయిర్ స్టైల్ చేయించుకున్నా వెంట్రుకల రంగు మార్చుకోకూడదు.


4. శానిటరీ ప్యాడ్స్

అమ్మాయిలకు చాలా ముఖ్యమైన శానిటరీ ప్యాడ్లు, టాంపన్లపై కూడా నార్త్ కొరియాలో నిషేధం ఉంది. ఇక్కడి మహిళలు ఇప్పటికీ రీయూజబుల్ ప్యాడ్లనే ఉపయోగిస్తుంటారు.

5. కండోమ్స్

నార్త్ కొరియాలో బర్త్ కంట్రోల్‌కు సంబంధించిన అన్ని విధానాలపై నిషేధం ఉంది. దీంతో ఇక్కడ కండోమ్స్ దొరకడం అసాధ్యం. అందుకే ఇక్కడి మగవాళ్లకు ఎవరైనా సీక్రెట్‌గా కండోమ్ ప్యాకెట్లు బహుమతిగా ఇస్తే చాలా సంతోషిస్తారట.


6. ప్రాపర్టీ

నార్త్ కొరియాలో భూమి, భవనాల హక్కులన్నీ ప్రభుత్వం వద్దే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇళ్లు కొనడం, అమ్మడం దాదాపు అసాధ్యం. అయితే కొందరు కొరియన్లు ఇలా చేయడానికి కొన్ని వక్ర మార్గాలు కనుగొన్నారు. దీంతో ఈ ఏడాదే ఈ విషయంలో కొన్ని చట్టాలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


7. డిజైనర్ షూస్

ఉత్తర కొరియా వెళ్లి అక్కడ ఏవైనా బ్రాండెడ్ షూస్ కొనుక్కుందాం అనుకుంటే అయిపోయామే. ఇక్కడ ఎటువంటి డిజైనర్ షూస్ దొరకవు. వాటిపై కూడా బ్యాన్ ఉంది. అయితే చైనాతో సరిహద్దు పంచుకునే ప్రాంతాలకు వెళ్తే చైనాలో తయారైన షూస్ దొరికే అవకాశం ఉంది.


8. క్రిస్టమస్ ట్రీ

ఉత్తర కొరియా నాస్తిక వాద దేశం. అందుకే ఇక్కడ ఎటువంటి మత పరమైన చర్యలూ చేయడానికి వీల్లేదు. ఒక వేళ అనుమతి ఉన్నా చాలా భారీగా పర్యవేక్షణ ఉంటుంది. అంటే ఇక్కడ కనీసం క్రిస్టమస్ ట్రీలు, దేవుళ్ల ఫొటోలు, మతపరమైన పుస్తకాలు వంటివి కూడా దొరకవు.


9. స్టార్ బక్స్ కాఫీ

ప్రపంచంలో అత్యంత పాపులర్ కాఫీ స్టార్‌బక్స్. ఇది కూడా ఉత్తర కొరియాలో దొరకదు. 

10. కేబుల్ టీవీ

ఉత్తర కొరియాలో కేవలం నాలుగే అధికారిక ఛానెల్స్ ఉంటాయి. అవి తప్పితే మిగతా టీవీ ఛానెల్స్ ఏవీ ఉండవు. ఇక్కడ ప్రభుత్వ సెన్సార్ షిప్ కూడా చాలా అధికంగా ఉంటుంది. 


11. పాశ్చాత్య మ్యాగజైన్లు

విదేశీ మీడియాను ఉత్తర కొరియా నిషేధిస్తుంది. ప్రెస్‌లో ఏమి ప్రింట్ చేయాలనే విషయాలను ప్రభుత్వం, స్పెషల్ ఏజెన్సీలు నిర్ణయిస్తాయి. లైఫ్‌స్టైల్‌కు చెందిన ఒక్క మ్యాగజైనూ ఇక్కడ ఉండదు. ఉన్నవి కూడా రాజకీయాలు, విద్యకు సంబంధించినవే.


12. వైఫై, అంతర్జాతీయ కాల్స్

ప్రస్తుతం ప్రతి ఇంట్లో వైఫై ఉండాల్సిందే. ఇంటర్నెట్ లేకపోతే ప్రాణం పోయినట్లే ఉంటుంది. కానీ ఉత్తర కొరియాలో అది కుదరదు. ఇక్కడ వైఫై ఉండదు. దేశంలోని 15 మిలియన్ల (1.5 కోట్ల) జనాభాలో 1 మిలియన్ (10 లక్షలు) మంది వద్ద మొబైల్ ఫోన్ ఉంటుంది. అయితే వారు కూడా అంతర్జాతీయ ఫోన్ కాల్స్ చేసుకోవడానికి అనుమతులు ఉండవు. మనమంతా 4జీ వాడేసి 5జీవైపు దూసుకుపోతుంటే నార్త్  కొరియన్లు మాత్రం 3జీ వాడాలన్నా నిబంధనలే.


13. మ్యూజిక్ కన్సార్ట్‌ల టికెట్లు

అతి కొద్ది మంది విదేశీయులకు మాత్రమే నార్త్ కొరియాలో మ్యూజిక్ కాన్సార్ట్‌లు ఏర్పాటు చేసే అవకాశం దొరుకుతుంది. ఇప్పటి వరకూ స్లొవేనియాకు చెందిన లైబాష్ అనే బృందం మాత్రమే నార్త్ కొరియాలో ప్రోగ్రాం ఇచ్చింది. అయితే స్థానిక బ్యాండ్లు ఏర్పాటు చేసే ప్రోగ్రాములకు వెళ్లొచ్చు.

14. యాపిల్ 

ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది వాడే బ్రాండ్లలో యాపిల్ ఒకటి. ఈ టెక్ జెయింట్‌పై ఉత్తర కొరియాలో నిషేధం ఉంది. ఇదొక్కటే కాదు ఎటువంటి ఆధునిక హై-టెక్ వస్తువులూ అమ్మడానికి వీల్లేదని ప్రభుత్వ ఆల్టిమేటం. ఇక్కడ యాపిల్ ఐప్యాడ్ కొనుక్కోవడం అసాధ్యం. దీనికి బదులు నార్త్ కొరియా ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్ పీసీ తయారు చేసింది. దాన్ని వాడుకోవడమే.


15. స్పోర్ట్స్ కార్లు

నార్త్ కొరియాలో అస్సలు లభించని మరో వస్తువు స్పోర్ట్స్ కార్లు. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల కారణంగా ఇక్కడ స్పోర్ట్స్ కార్లు కొనడం అసాధ్యం.


16. విదేశాలకు విహార యాత్రలు

ఈ విషయం చాలా మంది నార్త్ కొరియన్లకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఇక్కడి ప్రజలు విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లడంపై నిషేధం ఉంది. ఇలా చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement