ఈ తారల ఇంటి అద్దె ఎంతో తెలుసా?

ABN , First Publish Date - 2021-06-20T08:23:56+05:30 IST

సినిమా పరిశ్రమలో పేరు తెచ్చుకుని, సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత ఎవరైనా చేసే మొదటి పని సొంత ఇల్లు అమర్చుకోవడం. ఆ కల నెరవేరిన తర్వాత ఫామ్‌ హౌస్‌లు, తోటలు, పొలాలు కొంటుంటారు. ఆర్టిస్టులనే కాదు ఇతర టెక్నీషియన్స్‌ కూడా చేసే పనే ఇది!.

ఈ తారల ఇంటి అద్దె ఎంతో తెలుసా?

సినిమా పరిశ్రమలో  పేరు తెచ్చుకుని, సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత ఎవరైనా చేసే మొదటి పని సొంత ఇల్లు అమర్చుకోవడం. ఆ కల నెరవేరిన తర్వాత ఫామ్‌ హౌస్‌లు, తోటలు, పొలాలు కొంటుంటారు. ఆర్టిస్టులనే కాదు ఇతర టెక్నీషియన్స్‌ కూడా చేసే పనే ఇది!. అయితే కెరీర్‌ ప్రారంభించిన దశలో మాత్రం అద్దె ఇళ్లలో ఉండాల్సిందే. కొంతమంది మాత్రం ఎంత ఖర్చయినా పరవాలేదు అనుకొని అద్దె ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఇలా అద్దె ఇంట్లో ఉంటున్న బాలీవుడ్‌ తారల వివరాలు ఇవే!


కట్రీనా కైఫ్‌

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో కట్రీనా కైఫ్‌ చాలా ఇళ్లు మారారు. అందులో కార్టర్‌ రోడ్‌లో ఉన్న సిల్వర్‌ శాండ్స్‌ అపార్ట్‌మెంట్‌ ఒకటి. తన మాజీ బోయ్‌ ఫ్రెండ్‌ రణబీర్‌ కపూర్‌తో కలసి ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. 2016లో అతనితో బ్రేక్‌ అప్‌ అయ్యాక కూడా అదే అపార్ట్‌మెంట్‌లో కొనసాగారు. అద్దె ఎంతో తెలుసా? నెలకు 15 లక్షలు. ఆ తర్వాత ప్రస్తుతం బాంద్రా ప్రాంతంలో ఉంటున్న పెంట్‌ హౌస్‌కు మారారు కట్రీనా.


జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌

వ్యాపారవేత్త అయిన తన రహస్య ప్రేమికుడితో కలసి ఉండడం కోసం జాక్వలిన్‌ ఫెర్నాండజ్‌ రూ. 175 కోట్లు ఖర్చు పెట్టి ఓ ఖరీదైన భవంతిని కొనుగోలు చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం ఆమె ఐదు బెడ్‌రూమ్స్‌ ఉన్న లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఇదే అపార్ట్‌మెంట్‌లో ఇంతకుముందు ప్రియాంకా చోప్రా ఉండేవారు. ఆమె దగ్గర లీజుకు తీసుకుని అందులో ఉంటున్నారు జాక్వలిన్‌. దీని రెంట్‌ ఎంతో తెలుసా.. నెలకు రూ. 6.78 లక్షలు.



హృతిక్‌ రోషన్‌

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం హృతిక్‌ రోషన్‌కు ఇష్టం లేదు. అందుకే ఇల్లు కొనుక్కునే ప్రయత్నం చేయలేదు. గత ఏడాది జూన్‌ నుంచి జుహూ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. కిటికీ తెరిచి చూస్తే చాలు సముద్రం కనిపిస్తుంది. హృతిక్‌ పక్క ఇంట్లో అక్షయ్‌కుమార్‌, ట్వింకిల్‌ ఖన్నా దంపతులు ఉంటారు. హృతిక్‌ ఉంటున్న ఫ్లాట్‌ రెంట్‌ నెలకు రూ.8.25 లక్షలు. అంతే!


సన్నీ లియోన్‌

ముంబై వచ్చిన తొలి రోజుల్లో అద్దె ఇంటి కోసం సన్నీ లియోన్‌ అగచాట్లు పడుతుంటే, ఆమె సహనటి సెలీనా జైట్లీ సాయం చేసి అంధేరి ప్రాంతంలో ఓ ఇల్లు ఇప్పించింది. 

టెర్రస్‌ కలిగిన మూడు గదుల అపార్ట్‌మెంట్‌ అది. చాలా కాలం అందులోనే ఉన్న సన్నీ లియోన్‌ ఇటీవల రూ. 16 కోట్ల వ్యయంతో అట్లాంటిస్‌ అపార్ట్‌మెంట్‌లో 12 ఫ్లోరులో ఓ ఫ్లాట్‌ కొన్నారు, 4, 365 చదరపు అడుగులు ఉన్న  అతి పెద్ద ఫ్లాట్‌ ఇది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ పక్క ఇల్లు అమితాబ్‌ బచ్చన్‌ది.

Updated Date - 2021-06-20T08:23:56+05:30 IST