Viral Video: అంబులెన్స్‌ వెనుకే కిలోమీటర్ల మేర పరుగులు పెట్టిన గుర్రం.. కారణం ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-02-23T02:35:05+05:30 IST

సాటి మనిషి ఏమైపోయినా పర్వాలేదు అనుకునే నేటి కాలంలో జంతువులను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గుర్రం వీడియోనే ఇందుకు ఉదాహరణ. ఓ గుర్రం అంబులెన్స్‌ను దాదాపు 8కిలోమీటర్లు వెంబడిస్తుంది..

Viral Video: అంబులెన్స్‌ వెనుకే కిలోమీటర్ల మేర పరుగులు పెట్టిన గుర్రం.. కారణం ఏంటో తెలుసా..

జంతువుల మధ్య ఉండే ప్రేమానురాగాలు మనుషుల మధ్య ఎప్పుడో మంటగలిసిపోయాయనేది అక్షర సత్యం. పైపై ప్రేమలు చూపుతూ లోలోపల విషం నింపుకొని ఉండే నేటి మనుషుల కంటే జంతువులు చాలా నయమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సాటి మనిషి ఏమైపోయినా ఫర్వాలేదు అనుకునే నేటి కాలంలో జంతువులను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గుర్రం వీడియోనే ఇందుకు ఉదాహరణ. ఓ గుర్రం అంబులెన్స్‌ను దాదాపు 8 కిలోమీటర్లు వెంబడిస్తుంది. చివరకు కారణం తెలుకుని అంతా అయ్యో పాపం.. అంటూ ఆ గుర్రంపై సానుభూతి చూపించారు.


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుల్దీప్ సింగ్ షెకావత్ అనే వ్యక్తి గుర్రాలను పెంచుతుంటాడు. ఇతడు పెంచుతున్న గుర్రాలలో తోడబుట్టిన రెండు గర్రాలు ఎంతో అన్యోన్యంగా ఉండేవి. అయితే ఈ క్రమంలో ఓ గుర్రం ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆ గుర్రానికి వైద్యం చేయించేందుకు యజమాని.. పశు వైద్యాధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని గుర్రాన్ని అంబులెన్స్‌‌లోకి ఎక్కించి తీసుకెళ్లారు. అయితే అది గమనించిన మరో గుర్రం.. తన సోదరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనే కంగారులో అంబులెన్స్ వెనుక పరుగులు పెట్టడం మొదలెట్టింది. ఆస్పత్రి వరకూ దాదాపు 8కిలోమీటర్లు వరకూ వెనుకే వెళ్లింది.

కుక్కే కదా తింటే పోలా అనుకుంది.. దెబ్బకు పులికి దిమ్మ తిరిగింది.. చూస్తే అవాక్కవుతారు..



వెనుక వస్తున్న గుర్రాన్ని గమనించిన అంబులెన్స్ డ్రైవర్.. ఎంతో ముచ్చటపడి వాహనాన్ని నెమ్మదిగా నడపడం మొదలెట్టాడు. ఆస్పత్రి వరకు అంబులెన్స్ వెనుకే వెళ్లిన గుర్రం.. తన సోదరిని చూడగానే శాంతించింది. పక్కకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. తోడ బుట్టిన గుర్రంపై దానికున్న ప్రేమను చూసి అంతా ఆశ్చర్యపోయారు. గుర్రాల మధ్య అనుబంధాలు, ప్రేమలు ఎక్కువగా ఉంటాయని యజమాని కుల్దీప్ సింగ్ తెలిపాడు. 2012 నుంచి తాను గుర్రాలను పెంచుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ గుర్రం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కోబ్రాను పట్టుకునేందుకు ఈ యువతి పెద్ద సాహసమే చేసింది.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..



Updated Date - 2022-02-23T02:35:05+05:30 IST