టెలిగ్రామ్‌ ‘ప్రీమియర్‌’ పవర్‌ తెలుసా

ABN , First Publish Date - 2022-06-25T10:24:21+05:30 IST

వాట్సాప్‌కు పోటీగా మార్కెట్‌లో ఉన్న మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌కు ఉన్న ఆదరణ తెలిసిందే.

టెలిగ్రామ్‌ ‘ప్రీమియర్‌’ పవర్‌ తెలుసా

వాట్సాప్‌కు పోటీగా మార్కెట్‌లో ఉన్న మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌కు ఉన్న ఆదరణ తెలిసిందే. టెలిగ్రామ్‌ ప్రీమియమ్‌... ఇంకా బాగా చెప్పాలంటే పెయిడ్‌ వెర్షన్‌ వచ్చేసింది. ఐఓఎస్‌ అలాగే ఆండ్రాయిడ్‌ వేదికలపై దర్శనమిస్తోంది. మనదేశంలో ఐఓఎస్‌ యాప్‌ వెర్షన్‌ 8.8తో వచ్చింది. ఆండ్రాయిడ్‌కు కూడా త్వరలో చేరనుంది. ఇంతకీ ఈ కొత్త ఫీచర్‌ కథ కమామీషు ఏమిటంటే...

దీని చందా రేటు ఇంకా ప్రకటించలేదు. టెక్‌క్రంచ్‌ నివేదిక ప్రకారం దీని నెల వారీ చందా రూ.390 ఉండొచ్చు. 

దీని చందాదారులు 4జీబీ ఫైల్స్‌ పంపుకోవచ్చు. నాలుగు గంటలు 1080పి వీడియో లేదా 18రోజుల హైక్వాలిటీ ఆడియోకు అవకాశం ఉంటుందని యాప్‌ తన బ్లాగ్‌ పోస్టులో తెలిపింది.

యాప్‌లో అన్నివిధాలుగా పరిమితి పెంపు ఉంటుంది. వెయ్యి చానల్స్‌ ఫాలో కావచ్చు. 20 చాట్‌ ఫోల్డర్లు ఓపెన్‌ చేసి ఒక్కోదానిలో 200 మందితో మాటామంతీ కలపవచ్చు. ఏ టెలిగ్రామ్‌ యాప్‌కైనా నాలుగో అకౌంట్‌గా యాడ్‌ కావచ్చు. మెయిన్‌ జాబితాలో పది చాట్స్‌, పది ఫేవరేట్‌ స్టిక్కర్లను సేవ్‌ చేసుకోవచ్చు. మెంబర్‌గా అతి పెద్ద బయోడేటాకు తోడు సదరు లింక్‌ను కలుపుకోవచ్చు. 400 వరకు ఫేవరేట్‌ జీఐఎఫ్‌ల యాక్సెస్‌ పొందవచ్చు. 20 వరకు పబ్లిక్‌ టి.ఎం.ఇ లింక్స్‌ను రిజర్వు చేసుకోవచ్చు. తద్వారా షార్ట్‌ లింక్‌తో గ్రూప్‌ లేదా చానల్‌కు సహకరించవచ్చు.


మీడియా, ఫైల్స్‌ను చాలా వేగంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

వాయిస్‌ మెసేజ్‌ను టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు. 

ఎక్స్‌ట్రా ఎమోషన్స్‌, ఎక్స్‌ప్రెసివ్‌ ఎఫెక్ట్స్‌ కోసం డజన్ల కొద్దీ టెలిగ్రామ్‌ స్టిక్కర్లను ఫుల్‌ స్ర్కీన్‌ యానిమేషన్స్‌తో ఆగ్‌మెంట్‌ చేసింది. మంత్లీ అప్‌డేట్స్‌ స్టిక్కర్‌ కలెక్షన్‌ ప్రీమియమ్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

పది కొత్త ఎమోజీలను కూడా జతచేసింది.

ప్రీమియమ్‌ చందాదారుల చాట్‌ లిస్ట్‌ను ఆర్గనైజ్‌ చేసేందుకు టూల్స్‌ ఉన్నాయి. 

ప్రతి ఒక్కరి ప్రొఫైల్‌ వీడియోని యానిమేట్‌ చేస్తుంది. చాట్‌, చాట్‌ లిస్ట్‌కు కూడా ఇది వర్తిస్తుంది. ప్రీమియమ్‌ స్పెషల్‌ బ్యాడ్జ్‌ కూడా లభిస్తుంది. చాట్‌ లిస్టులో పేరుకు వెనక ఇది ఉంటుంది. చాట్‌ హోల్డర్‌, గ్రూపులోని మెంబర్స్‌కూ ఇది వర్తిస్తుంది. 

హోమ్‌ స్ర్కీన్స్‌కు యాడ్‌ చేసుకునేందుకు యూజర్లకు న్యూ ఐకాన్స్‌ లభిస్తాయి. ప్రీమియమ్‌ స్టార్‌, నైటీ స్కై, టర్బో ప్లేన్‌ నుంచి ఎంపిక చేసుకోవచ్చు. 

Updated Date - 2022-06-25T10:24:21+05:30 IST