మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

పెంగ్విన్స్‌ పిల్లలు కేజీ బరువు ఉంటే.. పెద్ద పెంగ్విన్‌ 40 కేజీల బరువు ఉంటుంది. పెంగ్విన్‌ లీడర్‌ వీటికంటే పొడవుగా, బరువుగా ఉంటుంది.

మీకు తెలుసా?

  • పెంగ్విన్స్‌ పిల్లలు కేజీ బరువు ఉంటే.. పెద్ద పెంగ్విన్‌ 40 కేజీల బరువు ఉంటుంది. పెంగ్విన్‌ లీడర్‌ వీటికంటే పొడవుగా, బరువుగా ఉంటుంది. 
  • వీటికి రెక్కల్లా ఉండే వాటిని ఫ్లిప్పర్స్‌ అంటారు. వీటితో ఎగరలేవు. అయితే సముద్రంలో అద్భుతంగా ఈదగల సత్తా వాటి ఫ్లిప్పర్స్‌ వల్లే వస్తుంది. ఆహారం కోసం సులువుగా 30 మీటర్లు డీప్‌ సీ లోకి పోగలవు. 
  • గుడ్లను, తన పిల్లలను చూసుకునే బాధ్యతను మగ, ఆడపెంగ్విన్స్‌ సమానంగా పంచుకుంటాయి. 
  • వాతావరణంలోని మార్పులే పెంగ్విన్స్‌కి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. మంచు కరిగినపుడు.. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. వేల్స్‌ పెంగ్విన్‌లను ఇష్టంగా భుజిస్తాయి. వేల్స్‌ బారినుంచి తప్పించుకోవటం వీటికో సవాల్‌.
  • 80 శాతం పెంగ్విన్స్‌ సముద్రంలోనే ఉంటాయి. గడ్డకట్టిన మంచు ఉండే వాతావరణమే వాటికి ఇష్టం.
  • పెంగ్విన్స్‌ గుంపుగా, కలివిడిగా ఉంటాయి. గుంపుగా ఉండి వేటాడం, ఆడుకోవడం, తినడం చేస్తాయి. అంటార్కిటికా లాంటి ప్రాంతాల్లో వీచే చలిగాలుల్ని ముందే కొన్ని పెంగ్విన్స్‌ గ్రహించి.. మిగతా సమూహాన్ని, పిల్లలను అప్రమత్తం చేయటానికి గట్టిగా అరుస్తాయి. సురక్షిత ప్రాంతాలకు కింగ్‌ పెంగ్విన్స్‌ గుంపులను తీసుకెళ్తాయి. 
  • వీటి జీవితకాలం 15నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST