టిక్‌ టాక్‌ లాంటి ఈ యాప్‌ ఎంత డేంజరో తెలుసా?

ABN , First Publish Date - 2020-02-18T00:49:32+05:30 IST

ప్రసిద్ధ యాప్‌ 'టిక్‌ టాక్‌' మాదిరిగా పేరు పెట్టుకున్న 'టు టోక్‌' మెసెంజర్‌ యాప్‌ ని గూగుల్‌ ఇటీవల తన ప్లేస్టోర్‌నుంచి తొలగించిన విషయం తెలిసిందే! ఇది యుఎఇ దేశం కోసం...

టిక్‌ టాక్‌ లాంటి ఈ యాప్‌ ఎంత డేంజరో తెలుసా?

ప్రసిద్ధ యాప్‌ 'టిక్‌ టాక్‌' మాదిరిగా పేరు పెట్టుకున్న 'టు టోక్‌' మెసెంజర్‌ యాప్‌ ని గూగుల్‌ ఇటీవల తన ప్లేస్టోర్‌నుంచి తొలగించిన విషయం తెలిసిందే! ఇది యుఎఇ దేశం కోసం పౌరుల మీద గూఢచర్యం చేస్తోందంటూ ప్లే స్టోర్‌నుంచి దీనిని తొలగించారు. అంత క్రితమే యాపిల్ యాప్‌ స్టోర్‌ కూడా  టు టోక్‌ యాప్‌కి స్వస్తి చెప్పింది.


అయితే చిత్రం ఏమిటంటే గూగుల్‌ ప్లేస్టోర్‌ మాత్రం ఈ యాప్‌ని తొలగించడం మొదటి సారి కాదు, రెండో సారి!  గత ఏడాది డిసెంబర్లో  టు టోక్‌ ని ప్లేస్టోర్‌లోంచి తొలగించిన గూగుల్ - మళ్లీ  జనవరి తొలివారంలోనే దానికి మళ్లీ స్థానం ఇచ్చింది. తొలిసారి తొలగించినప్పుడు - "మేం అంతా ఓపెన్‌. మేం చేసేది అంతా పారదర్శకం" - అంటూ  టు టోక్‌ వాళ్లు హామీ ఇవ్వడం వల్లే తిరిగి ప్లేస్టోర్లో దానికి స్థానం కల్పించామని గూగుల్‌ చెప్పుకొచ్చింది. అయితే అది పక్కా స్పై యాప్‌ అని ఇటీవల నిర్ణయించడంతో - ప్లే స్టోర్‌ దానికి బై చెప్పేసింది. అయితే మళ్లీ  టు టోక్‌ తన వెర్షన్‌ చెప్పడం మళ్లీ మొదలుపెట్టింది. కానీ అనేక అనుమానాల మధ్య - మళ్లీ ఈ యాప్‌కి ఈసారి ప్లే స్టోర్‌లో స్థానం దక్కకపోవచ్చని తెలుస్తోంది.


ఇంతకీ టు టోక్‌ యాప్‌ని  సైబర్‌ నిపుణులు  ఇంత డేంజరని ఎందుకు చెబుతున్నారు? అసలు వాళ్లు ఏమంటున్నారు?


" టు టోక్‌ యాప్‌ చాలా తెలివైన గూఢచారి. ఎవరి సమాచారాన్నయినా వాళ్లు హ్యాక్‌ చేయాలంటే - పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఈ యాప్‌ని యూజర్లు ఇష్టపడి ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చేస్తే చాలు. వాళ్లే వాళ్ల సొంత సమాచారం మొత్తం తమంత తాముగా పువ్వుల్లో పెట్టి ఈ యాప్‌ ద్వారా అందిస్తారు. ఎవ్వరికీ అనుమానం కూడా రాదు. ఇదే ఈ యాప్‌ క్రియేటర్స్‌ చేసిన మ్యాజిక్‌! - అంటూ సైబర్‌ నిపుణులు ఈ యాప్‌లో ఉన్న లోపాల్ని చెబుతున్నారు.


ఏ సమాచారం అయినా - వాళ్లంతట వాళ్లు ఇష్టపడి ఇస్తేనే తీసుకోగలం. అలాగే తీసుకున్నాం. ఇందులో తప్పేం ఉంది? - అని యాప్‌ క్రియేటర్స్‌ వితండవాదం చేస్తున్నారు.


తమ వ్యక్తిగత విషయాల్ని పంచుకోవడం ఎంత డేంజరో తెలియని జనానికి - టోపీ వేసే యాప్స్‌ వేలకొద్దీ వస్తున్నాయిప్పుడు. ప్రభుత్వం ప్రజల మీద కన్నేసి ఉంచాలంటే - పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. టో టాక్‌ లాంటి చిన్న యాప్‌ ని వాళ్ల ఫోన్స్‌లో ఇన్‌స్టాల్‌ చేయిస్తే చాలు! - అంటున్నారు సైబర్‌ నిపుణులు - ఈ అనుభవం తరవాత!

Updated Date - 2020-02-18T00:49:32+05:30 IST