Google : ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసా?

ABN , First Publish Date - 2022-09-22T16:03:29+05:30 IST

అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ గురించి మీకు తెలుసా? ఇక మీదట ఈ ఫీచర్‌ను వినియోగించి ఎంపిక చేసిన దేశాలలో

Google : ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసా?

Google : అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ గురించి మీకు తెలుసా? ఇక మీదట ఈ ఫీచర్‌ను వినియోగించి ఎంపిక చేసిన దేశాలలో రైలు టిక్కెట్ల(Train Tickets)ను ఎంచక్కా కొనుక్కోవచ్చు. తాజాగా ఈ ఫీచర్‌ను గూగుల్ (Google) ప్రకటించింది. ఇది త్వరలో మరిన్ని దేశాలలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం అయితే.. జర్మనీ (Germany), స్పెయిన్ (Spain), ఇటలీ (Italy), జపాన్‌ (Japan)లోని వినియోగదారులు ఇప్పుడు రైలు టిక్కెట్ల కోసం నేరుగా గూగుల్ (Google) ద్వారా టికెట్లను కొనుగోలు చేసి షాపింగ్ చేయవచ్చు.


కొన్ని ప్రయాణాల(Train Jouneys)కు రైలు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ట్రైన్ టికెట్స్‌ (Train Tickets)ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు గూగుల్‌కు చెందిన ట్రావెల్ ప్రోడక్ట్స్ వీపీ రిచర్డ్ హోల్డెన్ తెలిపారు. కానీ ఇతర దేశాల్లో ఒకచోటి నుంచి మరో చోటికి ప్రయాణానికి ధరలు, షెడ్యూల్‌లను తెలుసుకునేందుకు సైతం సెర్చ్ చేసేందుకు అవకాశం ఉందని హోల్డెన్ వెల్లడించారు. ఇక ఇది మనకెలా ఉపయోగం అంటే.. ఈ ఎంపిక చేసిన దేశాల్లో పర్యటించాలంటే.. ముందుగా ఒక షెడ్యూల్‌ను ప్రిపేర్ చేసుకుంటాం కదా. దాని ప్రకారం ఆయా దేశాల్లో లోకల్ జర్నీ కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ట్రైన్ టికెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు. 


జర్మనీ, స్పెయిన్, ఇటలీ, జపాన్‌తో సహా ఎంపిక చేసిన దేశాలలో.. లోకల్ ప్రయాణాల కోసం ఎక్కడి నుంచైనా నేరుగా గూగుల్ సెర్చ్‌(Google Search)లోకి వెళ్లి రైలు టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు."మేము ఇతర రైల్ ప్రొవైడర్‌లతో కలిసి పని చేస్తున్నందున ఈ ఫీచర్‌ను మరిన్ని స్థానాలకు విస్తరింపజేయనున్నట్టు హోల్డెన్ తెలిపారు. ఇంటర్‌సిటీ ప్రయాణం కోసం మీ ఆప్షన్‌ను త్వరలో మరింత పెంచుతామని.. అలాగే వీలైనంత త్వరగా బస్సు టిక్కెట్‌ల కోసం కూడా ఇదే విధమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని హోల్డెన్ చెప్పారు. 


Updated Date - 2022-09-22T16:03:29+05:30 IST