విమర్శించే నైతిక హక్కుందా ? మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2020-07-04T00:56:49+05:30 IST

ఏడు దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించినోళ్లు, తెలంగాణ కు అడ్డుపడ్డ వాళ్ళు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణను తెచ్చిన మా ప్రభుత్వాన్ని విమర్శించడమా ? అని ఎక్సైజ్ శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాల్వలకు, ,చెరువులకు గండ్లు పడక పోతే మనుషులకు పడతాయా ? అని ప్రశ్నించారు. మీరు కాల్వలు తవ్వలేదు కనుకే గండ్లు పడలేదని, కాంగ్రెస్ హయాంలో కాల్వల కోసం తట్టెడు మన్ను తీయలేదు గనుకే గండ్లు కూడా పడలేదని విమర్శించారు.

విమర్శించే నైతిక హక్కుందా ? మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : ఏడు దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించినోళ్లు, తెలంగాణ కు అడ్డుపడ్డ వాళ్ళు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణను తెచ్చిన మా ప్రభుత్వాన్ని విమర్శించడమా ?  అని ఎక్సైజ్ శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాల్వలకు, ,చెరువులకు గండ్లు పడక పోతే మనుషులకు పడతాయా ? అని ప్రశ్నించారు. మీరు కాల్వలు తవ్వలేదు కనుకే గండ్లు పడలేదని, కాంగ్రెస్ హయాంలో కాల్వల కోసం తట్టెడు మన్ను తీయలేదు గనుకే గండ్లు కూడా పడలేదని విమర్శించారు.


ఇప్పుడు తెలంగాణ అంతటా కాల్వల్లో నీళ్లు కనిపిస్తున్నాయని, ఇదే క్రమంలో... చిన్న చిన్న గండ్లు కూడా సహజమేనని పేర్కొన్నారు. కాగా... ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఇంటికి సాగనంపే రోజు దగ్గరలోనే ఉందంటూ బీజేపీ నేత రామ్ మాధవ్ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తెలంగాణ ప్రతి ఎన్నికలో బీజేపీ ని ప్రజలు ఇంటికే పంపారన్నారు.


ఇక...కాంగ్రెస్ నేతలు తమ బంధువులను అడిగి రాష్ట్ర ప్రభుత్వ పని తీరు గురించి తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి ప్రతి ఒక్కరూ గర్వపడాలని, నీచ రాజకీయాల కోసం తెలంగాణ ప్రతిష్ట దిగజారేలా ప్రవర్తించొద్దని హితవు పలికారు. 

Updated Date - 2020-07-04T00:56:49+05:30 IST