మైఖేల్ కోర్స్లేతో బ్రేకప్ తర్వాత శ్రుతీ హాసన్ మరొకరితో ప్రేమలో పడ్డారా? ప్రస్తుతం ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా?! ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శ్రుతీ హాసన్ ఇచ్చిన సమాధానాలు చూస్తే... ‘అవును’ అనే అనిపిస్తోంది. ‘మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. నిజమా? అబద్ధమా?’ అని ఒకరు ప్రశ్నించారు. ‘‘నిజం... అని అనుకుంటున్నా?!’’ అని కన్నుకొట్టిన ఎమోజీని శ్రుతి పోస్ట్ చేశారు. అయితే, బాయ్‌ఫ్రెండ్ ఎవరో చెప్పలేదు. ఈ ఏడాది తాను పెళ్లి చేసుకోబోవడం లేదనీ, ఆ వార్త అబద్ధమేనని మరో ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఆమె స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రేమలో ఉంటానని అన్నారు. ‘మీ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను అసహ్యించుకుంటున్నారా?’ అనే ప్రశ్నకు... ‘‘మీరు చెడ్డవ్యక్తి. నేను ఎవర్నీ అసహ్యించుకోను’’ అని చెప్పారు. ‘నేను కోటీశ్వరుణ్ణి అయితే నన్ను పెళ్లి చేసుకునేవారు కదా?’ అని ఒకరు అడగ్డా... ‘‘అబద్ధం’’ అని బదులు ఇచ్చారు. ‘క్రాక్’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడానికి కారణం ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతోందనే సమాచారం తనకు లేకపోవడంతో పాటు తాను వేరే సినిమా చిత్రీకరణలో ఉన్నానని శ్రుతీ హాసన్ వివరణ ఇచ్చారు.