పర్యాటకంపై.. పట్టింపేదీ?

ABN , First Publish Date - 2021-02-28T04:16:15+05:30 IST

ఉమ్మడి జిల్లాల వర ప్రదా యిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశాలు చూడ తరంగా మారాయి.

పర్యాటకంపై.. పట్టింపేదీ?

కళాహీనంగా మారిన నిజాంసాగర్‌ పర్యాటక ప్రదేశాలు
తెలంగాణ పాలనలో ఉమ్మడి జిల్లా వరప్రదాయినికి పూర్వ వైభవం వచ్చేనా?
హామీలకే పరిమితం అవుతున్న వైనం
ఎక్కడ చూసినా చెత్తా చెదారం
సిబ్బంది కొరతనే కారణంటున్న ఇరిగేషన్‌ అధికార యంత్రాంగం
ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని వేడుకోలు
నిజాంసాగర్‌, ఫిబ్రవరి 27: ఉమ్మడి జిల్లాల వర ప్రదా యిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశాలు చూడ తరంగా మారాయి. ఆనాడు నైజాం ప్రభుత్వం ఉభయ జిల్లాల్లోని పర్యాటకుల కోసం నిజాంసాగర్‌ ప్రాజెక్టుపై ప్రాచీన కట్టడాలతో పాటు పర్యాటక ప్రదేశాలను, స్థలాల ను ఏర్పాటు చేశారు. కాలక్రమేణా పర్యాటక స్థలాలు కళాహీనంగా మారాయి. పాలకులు, అధికారులు మారినా నిజాంసాగర్‌ పర్యాటక స్థలాల రూపు రేఖలు మారలేకపో వడం గమనార్హం. సమైక్యాంధ్ర పాలనలో నిర్లక్ష్య వైఖరికి గురైంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా నిజాంసాగర్‌ పర్యాటక ప్రదేశాలు పూర్వ వైభ వానికి నోచుకోలేదు. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఫలితంగా అనేక మంది మంత్రులు నిజాంసాగర్‌ ప్రాజెక్టును సందర్శిస్తూనే ఉన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టును ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీష్‌రావు, సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రోడ్డు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డిలు సందర్శించి.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేశారు. కానీ నిజాంసాగర్‌ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనే దిశగా
ఎవరూ ఆలోచించడం లేదు. నిజాంసాగర్‌లో ప్రాచీన కట్టడాలైన గోల్‌బంగ్లా, వీఐపీ గార్డెన్‌, స్విమ్మింగ్‌ పూల్‌, తదితర కట్టడాలు కళాహీనంగా మారాయి. వీటికి పూర్వవైభవం తేవాలనే ఆలోచన లేకుండా పోయింది. ప్రాజెక్టును సందర్శించి, నిజాంసాగర్‌ పర్యాటకానికి పూర్వ వైభవం తేస్తామంటూనే ఉన్నారు. కానీ, పర్యాటక ప్రదేశాలతో పాటు గార్డెన్లు ఆనవాళ్లు కోల్పోతూనే ఉన్నాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టుపై గుల్‌గస్త్‌ బంగ్లా వద్ద దాదాపు మూడున్నర ఎకరాల్లో పర్యాటక ప్రదే శాన్ని 1921లో నిర్మాణం చేసి, 1932లో జాతికి అంకితం చేశా రు. అప్పటి నుంచి కాలక్రమేణా గుల్‌గస్త్‌ బంగ్లాతో పాటు గార్డెన్‌, చెత్తా చెదారం పేరుకుపోతున్నా పట్టించుకునే నాథుడే కరువవుతున్నారు. 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం గోల్‌బ ంగ్లా, వీఐపీ బంగ్లా, గుల్‌గస్త్‌ బంగ్లాను దాదాపు కోటి రూపా యల వ్యయంతో మరమ్మతులు చేశారు. కానీ, పర్యాటకశాఖ, ఇరిగేషన్‌ సంయుక్తంగా నిర్వహణ చేయాల్సి ఉన్నప్పటికీ వాటి నిర్వహణ లేకపోవడంతో గార్డెన్లు, కాటేజీలు కళాహీనంగా మారాయి. గుల్‌గస్త్‌ గార్డెన్‌లో ఉన్న నీరు విరజిమ్మే పౌంటె న్లు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. గుల్‌గస్త్‌ సమీపంలోని ప్రాజెక్టు అంతర్‌ భాగంలో ఉన్న ఛత్రీనౌకా బంగ్లా కళాహీ నంగా మారింది. ఈ గార్డెన్‌లో అప్పట్లో వేసిన పచ్చని పం దిళ్లు నీడ లేకుండా పోవడం గమనార్హం. వీఐపీలు, అధికా రులు వస్తేనే తప్ప ఈ గార్డెన్‌లలోని చెత్తా చెదారాన్ని తొలగించారు. కానీ, పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు చెత్తా చెదారాన్ని తొలగించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

 పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా నిజాంసాగర్‌ పర్యాటకంపై నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తూనే ఉన్నారని ఆరోప ణలు వినవస్తున్నాయి. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రకృతి గార్డెన్‌లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. కానీ నిజాంసాగర్‌ ప్రాచీన కట్టడాలతో పాటు పర్యాటక స్థలాలపై నిర్లక్ష్యం అవలంభిస్తూనే ఉంది. ఇప్పటికైనా పాలకులు, అధి కార యంత్రాంగం ఉమ్మడి జిల్లాల నిజాంసాగర్‌కు పర్యా టకంగా పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాల్సిన అవస రం ఎంతైనా ఉంది.

పూర్వం ఎంతో సుందరంగా ఉండేది
లక్ష్మీనారాయణమూర్తి, న్యాయవాది, బాన్సువాడ.
నిజాంసాగర్‌ పర్యాటక ప్రాచీన కట్టడాలకు రాష్ట్ర రాజధానిలోనే ప్రాముఖ్యత సంతరించుకోవడం విశేషం. నిజాంసాగర్‌ ప్రాచీన పర్యా టక స్థలాలు అప్పట్లో ఎంతో సుందర ంగా ఉండేవి. కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అవి కళా హీనంగా మారాయి. తెలంగాణ వచ్చాక నిజాంసాగర్‌కు పూర్వ వైభవం వస్తోందని ఆశ పడ్డాం. కానీ నిరాశనే మిగు లుతోంది. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ఉమ్మడి జిల్లాల పర్యాటకాన్ని తీర్చిదిద్దకపోవడం గమనార్హం.

పర్యాటకులు వస్తేనే మాకు వ్యాపారం
గౌడి శేఖర్‌, హోటల్‌ వ్యాపారి.
నిజాంసాగర్‌ పర్యాటకం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు వచ్చే పర్యాట కులతో మా హోటల్‌ వ్యాపారం ఎంతగానో కొనసాగుతుండేది. పూర్వ కాలం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ పర్యాటక కేంద్రం వల్ల హోటల్‌ వ్యాపారం ఎంతో ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు నిజాంసాగర్‌ అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా మారింది. నిజాంసాగర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినట్లయితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి తరలివస్తారు.

Updated Date - 2021-02-28T04:16:15+05:30 IST