స్క్రీన్ మినుకు మినుకుమంటే ఇలా చేయండి

ABN , First Publish Date - 2022-06-04T08:50:26+05:30 IST

విండోస్‌10, విండో్‌స11లో స్ర్కీన్‌పై మినుకు మినుకులకు కారణాలు అనేకం.

స్క్రీన్  మినుకు మినుకుమంటే ఇలా చేయండి

విండోస్‌10, విండో్‌స11లో స్ర్కీన్‌పై మినుకు మినుకులకు కారణాలు అనేకం. డిస్‌ప్లే డ్రైవర్‌తో మొదలుపెట్టి సమర్థత లేని యాప్‌లు, మానిటర్‌ కేబుల్‌ లూజుగా ఉండటం వంటివన్నీ సమస్యకు కారణమవుతూ ఉంటాయి. లాప్‌టాప్‌, డెస్క్‌ టాప్‌ రెండిటిలోనూ సమస్యను ఇలా పరిష్కరించుకోవచ్చు. 


టాస్క్‌ మేనేజర్‌

కంట్రోల్‌ + ఆల్ట్‌ + డిలీట్‌ ప్రెస్‌ చేస్తే టాస్క్‌ మేనేజర్‌ ఓపెన్‌ అవుతుంది. అలా కాని పక్షంలో కంట్రోల్‌ + షిఫ్ట్‌ + ఎస్కే్‌పను ప్రెస్‌ చేస్తే టాస్క్‌ మేనేజ్‌ ఓపెన్‌ అవుతుంది. టాస్క్‌ మేనేజర్‌ ఫ్లిక్కర్స్‌కు తోడు స్ర్కీన్‌పై ప్రతీది ఉంటే డిస్‌ప్లే డ్రైవర్‌తో సమస్య కావచ్చు. సమర్థతలేని యాప్‌ కూడా కావచ్చు. అదే అయితే దాన్ని అన్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే చాలు.


డిస్‌ప్లే డ్రైవర్‌

విండోస్‌ అప్‌డేట్‌ డివై్‌సకు ఇటీవలే చేసి ఉంటే మళ్ళీ వెనక్కురావాలి. అలాకానిపక్షంలో అప్డేట్‌ లేదంటే అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా మినుకు మినుకుమనడం లేదంటే మూవ్‌ చేయడంలో ఉన్న సమస్యలను నివారించవచ్చు. 

మరొక అంశం యాప్‌. మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ నుంచి తీసుకుంటే సంబంధిత అప్‌డేట్స్‌ను చెక్‌ చేసుకోవాలి. అలా కాకుంటే దాని ఉత్పత్తిదారు సైట్‌కు వెళ్ళి అప్‌డేట్స్‌ తెలుసుకోవాలి. 

పీసీ మానిటర్‌ కేబుల్‌ లూజుగా ఉంటే కూడా సమస్య తలెత్తుతుంది. దాన్ని అన్‌ప్లగ్‌ చేసి చెక్‌ చేసుకుంటే సమస్య అది అవునా కాదా అన్నది తెలుస్తుంది ఆ వెంటనే తగుచర్య తీసుకోవచ్చు.

రిఫ్రెష్‌ రేటు మరొక అంశం. ఒక సెకెన్‌ వ్యవధిలో స్ర్కీన్‌పై ఇమేజ్‌ రిఫ్రెసెస్‌ లెక్కలోకి వస్తాయి. ఉదాహరణకు 600హెచ్‌జెడ్‌ డిస్‌ప్లే సెకెండ్‌ 60 సార్లు అప్‌డేట్‌ అవుతుంది. హయ్యర్‌ రిఫ్రష్‌ రేటును మనకు మనమే సెలెక్ట్‌ చేసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అసలు సమస్య దేని ఫలితం అన్నది తెలుసుకుంటే నివారించుకుని స్ర్కీన్‌ మినుకు మినుకుమనకుండా చూసుకోవచ్చు. 

Updated Date - 2022-06-04T08:50:26+05:30 IST