వేరుశనగ రైతుల ఆశలు ఆవిరేనా?

ABN , First Publish Date - 2021-10-11T05:44:59+05:30 IST

ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వేరుశనగ పంట దిగుబడి అంతంత మా త్రంగానే ఉండటంతో రైతన్నల ఆశలు ఆవిరవుతున్నాయి. మూడేళ్లుగా వరుస నష్టాలను చవిచూస్తున్న రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ పంట విస్తా రంగా సాగు చేశారు.

వేరుశనగ రైతుల ఆశలు ఆవిరేనా?
అంగళ్లు వద్ద సాగు చేసిన వేరుశనగ

నిరాశాజనకంగా పంట దిగుబడి


పెట్టుబడి కూడా చేతికందదేమోనని ఆందోళన


కురబలకోట, అక్టోబరు 10: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వేరుశనగ పంట దిగుబడి అంతంత మా త్రంగానే ఉండటంతో రైతన్నల ఆశలు ఆవిరవుతున్నాయి.  మూడేళ్లుగా వరుస నష్టాలను చవిచూస్తున్న రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ పంట విస్తా రంగా సాగు చేశారు. మదనపల్లె మండలంలో 1836 హెక్టార్లలో, నిమ్మనపల్లెలో 1439, బి.కొత్తకోటలో 2929, కురబలకోటలో 1932, తంబళ్ళపల్లెలో 4303, ములకలచెరువులో 4532, పీటీఎంలో 5793 హెక్టార్లలో పంటను సాగు చేశారు. విత్తినప్పటి నుంచి దిగుబడి చేతికి అందే వరకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసం హారక మందులకు ఎకరాకు రూ.30 నుంచి 40వేల వ రకు  అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టారు. కొన్ని ప్రాం తాల్లో ముందుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వివిధ దశల్లో పంటను సాగు చేశారు. దీంతో కొన్ని చోట్ల ముందుగా, మరికొన్ని చోట్ల ఆలస్యంగా దిగుబడి చేతికి అందుతోంది. ఎకరానికి కనీసం 20నుంచి 30 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేయగా అం దుకు భిన్నంగా 5 నుంచి 10 బస్తాలకు మించి దిగు బడి రావడం లేదు.


రెండు రోజులుగా వర్షాలు కురు స్తుండడంతో పంటను ఒబ్బిడి చేయడానికి రైతులు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. నేల నుంచి బయటకు తీసిన చెట్లు పొలాల్లోనే ఉండడంతో వర్షానికి తుడు స్తున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే కాయలు రంగు మారడంతో పాటు గింజలు మొలక వచ్చే అవకాశం ఉంది. ఇన్ని కష్టనష్టాలకోర్చి కాయలు ఇంటికి తెచ్చినా వచ్చినా ధరలు ఏమాత్రం ఉంటాయో వేచి చూడా ల్సిందే. లాభాలు మాట దేవుడెరుగు పెట్టిన పెట్టు బడైౖన చేతికి అందేలా కనిపించడం లేదు. పంటపై కోటి ఆశలతో ఎదురు చూసిన రైతులు మరోసారి అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితులు నెలకొనగా, చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక తమలోతామే కుమిలిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.



నీట మునిగిన వేరుశనగ


పెద్దమండ్యం:  మండల పరిధిలోని బిక్కావాండ్ల పల్లె సమీ పంలో  వర్షపు నీటితో నిండిన హంద్రీ-నీవా కాలువ లీకేజీతో వేరుశనగ పంట మునిగింది.  రెండు రోజులుగా కురిసిన వర్షానికి పలు చెరువులు, కుంటలు నిండి మొరవ పోతున్నాయి. దీంతో ఎగువ ప్రాంతంలో ఉన్న హంద్రీ-నీవా కాలువకు చిన్నపాటి లీకేజీతో పంట నీట మునిగి నష్టపో యానని రైతు సురేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. నీట ముని గిన పంటను అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.  


Updated Date - 2021-10-11T05:44:59+05:30 IST