రైల్వేను ప్రైవేటీకరించ వద్దు

ABN , First Publish Date - 2020-07-18T10:23:27+05:30 IST

రైల్వే రంగాన్ని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.

రైల్వేను ప్రైవేటీకరించ వద్దు

రామలక్ష్మణ జంక్షన్‌, జూలై 17: రైల్వే రంగాన్ని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. రైల్వే ప్రైవేటీకరణను నిరసిస్తూ శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయంలోని రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద సీఐటీయూ నాయకుల శుక్రవారం ధర్నా చేశారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే రంగాన్ని కారు చౌకగా పెట్టుబడిదారులకు అందించేందుకు మోదీ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, గనులు, రక్షణ రంగాలు, ఎయిర్‌ ఇండియా వంటి రంగాలను కార్పొరేట్‌  శక్తులకు కట్టబెట్టారని విమర్శించారు. రైల్వే ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో పాల్గొన్న వారిలో  1వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిరావు, సింహాచ లం, ఈశ్వరమ్మ, తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు.  


ఆమదాలవలస రూరల్‌: రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ  శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ ఆవరణలో సీఐటీయూ నాయకులు ఆందోళన చేశారు. ప్రభుత ్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని మానుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ప్రజల సహకారంతో ఇలాంటి వాటిని అడ్డుకుంటామన్నారు. బొడ్డేపల్లి మోహనరావు, జనార్దనరావు సంఘీభావం తెలిపారు.


కంచిలి: రైల్వే ప్రైవేటీకరణనువిరమించుకోవాలంటూ కంచిలిలో సీపీఎం ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం చేపట్టారు.  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎ.సత్యనారాయణ, ఎస్‌.లక్ష్మీనారాయణ, కె.గోపినాథ్‌, పి.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-18T10:23:27+05:30 IST