Abn logo
Sep 25 2021 @ 00:13AM

ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం వద్దు

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ యాస్మిన్‌బాషా

వనపర్తి అర్బన్‌, సెప్టెంబరు 24: రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను ఎలాంటి జా ప్యం లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌  యాస్మిన్‌ బాషా ఆదేశిం చారు.  కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరం లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశం లో  ఈజీఎస్‌,  హరితహారం, జలశక్తి అభియా న్‌, ఆజాద్‌కా అమృతోత్సవ్‌ కార్యక్రమాలపై జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈజీఎస్‌ ప నులను పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పూ ర్తి చేయాలని  సూచించారు. హరితహారం మొ క్కలను పెండింగ్‌ లేకుండా ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని సత్వరమే పరిష్కరించి పూర్తి చే యాలని  అన్నారు. ప్రతీ గ్రామంలో జలశక్తి అ భియాన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని, నీటి పొ దుపు, ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆజాద్‌ అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు అభివృద్ధి పనులు చేపట్టి, కొనసాగిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రతీ పంచాయతీలో నర్సరీ లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, వాటి సంరక్షణ బాధ్యత అధికారులు పూర్తి స్థాయిలో చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) అంకిత్‌, జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీపీవో సురేష్‌, డీఎల్‌పీవో, ఆడీఆర్‌ డీవో నరసిహులు, అడిషనల్‌ డీఆర్‌ డీవో కృష్ణ య్య, ఏపీడీలు, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఏసీ ఎల్‌బీసీఈవవో, ఏపీడీ సుల్తాన్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.