కళ్లేపల్లి ఇసుక ర్యాంపు వద్దు

ABN , First Publish Date - 2022-05-17T04:40:41+05:30 IST

శ్రీకాకుళం మండలం కళ్లేపల్లి ఇసుక ర్యాంపును తక్షణమే నిలుపుదల చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ స్పందన కార్యక్రమం నిర్వహించిన.. జడ్పీ కార్యాలయం వద్ద సోమ వారం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

కళ్లేపల్లి ఇసుక ర్యాంపు వద్దు
కలెక్టర్‌ స్పందన వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

- నిలుపుదల చేయాలని టీడీపీ నాయకుల ఆందోళన
- కలెక్టర్‌ స్పందనలో డీఆర్వోకు వినతి
కలెక్టరేట్‌, మే 16:
శ్రీకాకుళం మండలం కళ్లేపల్లి ఇసుక ర్యాంపును తక్షణమే నిలుపుదల చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ స్పందన కార్యక్రమం నిర్వహించిన.. జడ్పీ కార్యాలయం వద్ద సోమ వారం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ సం దర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. ‘పర్యావరణ అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన కళ్లేపల్లి ఇసుక ర్యాంపును తక్షణమే రద్దు చేయాలి. దీనిపై గతంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. డిసెంబరు నెలలో నిలుపుదల చేశారు. మళ్లీ అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ర్యాంపు నిర్వాహకులకు కొంతమంది అధికా రులు సహకరిస్తు న్నారు. అక్రమ ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటి.. కళ్లేపల్లితో పాటు చుట్టపక్కల గ్రామస్థులకు తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. తక్షణమే ఈ ర్యాంపు నిలుపుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామ’ని హెచ్చరించారు. ఈ మేరకు డీఆర్వో ఎం.రాజేశ్వరికి వినతిపత్రాన్ని అందజేశారు.  

 విలీన గ్రామాలకు ‘ఉపాధి’  కల్పించండి
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనమైన ఏడు పంచాయతీల్లో ఉపాధి పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విలీన గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. దీంతో పాటు పెండింగ్‌ బిల్లులు కూడా చెల్లించాలని డీఆర్వోకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, టీడీపీ నాయకులు కోర్ను ప్రతాప్‌,  కె.జగదీష్‌,  మెండ దాసునాయుడు, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు,  ఎ.రవీంద్ర, ఎం.శ్రీను, కళ్లేపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T04:40:41+05:30 IST