వేతన జీవుల పొట్టగొట్టే పీఆర్సీ వద్దు

ABN , First Publish Date - 2022-01-19T06:18:53+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయ, వేతన జీవుల పొట్టగొట్టే అసంబద్ధ, అశాస్ర్తీయ పీఆర్సీ తమకొద్దంటూ స్థానిక జడ్పీహైస్కూల్‌ ఉపాధ్యాయులు మంగళ వారం నల్లబ్యాడ్జీలు ధరించి పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.

వేతన జీవుల పొట్టగొట్టే పీఆర్సీ వద్దు
ములకలచెరువులో పీఆర్సీ ప్రతుల దహనం

మదనపల్లె క్రైం/ ములకలచెరువు/ పెద్దతిప్పస ముద్రం/ మదనపల్లె టౌన్‌/ బి.కొత్తకోట, జనవరి 18: ఉద్యోగ, ఉపాధ్యాయ, వేతన జీవుల పొట్టగొట్టే అసంబద్ధ, అశాస్ర్తీయ పీఆర్సీ తమకొద్దంటూ స్థానిక జడ్పీహైస్కూల్‌ ఉపాధ్యాయులు మంగళ వారం నల్లబ్యాడ్జీలు ధరించి పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.  35 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఇంటిఅద్దె అలవెన్సులను యధా తథంగా కొనసాగించాలన్నారు. నిరసన కార్యక్ర మాల్లో భాగంగా ఫ్యాప్టో నాయకులు  చిత్తూరు బస్టాండు సర్కిల్లో సీఎస్‌ పీఆర్సీ ప్రతులను దహనం చేశారు. పోకల మధుసూదన్‌, సుధాకర్‌ నాయుడు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అసంబద్ధంగా, అశాస్త్రీయంగా అర్ధరాత్రి విడుదల చేసిన పీఆర్సీపై ములకలచెరువులో ప్రభుత్వ ఉద్యోగులు మండిపడ్డారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. ఆమోద యోగ్యంగా లేని పీఆర్సీ తమకొద్దంటూ పీటీఎంలో ఫ్యాప్టో  నాయకులు  నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి పీఆర్సీ ప్రతులను దహనం చేశారు.  అశాస్త్రీయ పీఆర్సీ జీవో తమ కొద్దంటూ సీటీఎం జడ్పీహైస్కూల్‌ వద్ద ఫ్యాప్టో నాయకులు నిరసన తెలిపారు. పీఆర్సీ జీవో ప్రతులను మంగళవారం ఫ్యాప్టో నాయకులు బి.కొత్తకోట ఎమ్మార్సీ కార్యాలయం వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పీఆర్సీతో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు.  



Updated Date - 2022-01-19T06:18:53+05:30 IST