వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు : చైర్మన

ABN , First Publish Date - 2021-07-27T06:23:08+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోరాళ్ల శిల్ప పేర్కొన్నారు. పురపాలక సంఘం పరిధిలోని సచివాలయాల్లో సోమవారం మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ని ర్వహించారు.

వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు : చైర్మన
రాయదుర్గంలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన శిల్ప, కమిషనర్‌ జబ్బార్‌ మియా

రాయదుర్గం టౌన, జూలై 26 : కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోరాళ్ల శిల్ప పేర్కొన్నారు. పురపాలక సంఘం పరిధిలోని సచివాలయాల్లో సోమవారం మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ని ర్వహించారు. 4, 7 సచివాలయాల్లో ఆమెతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా, కౌన్సిలర్లు శ్రీనివాస్‌ రెడ్డి, మంజు పరిశీలించారు. గర్భిణు లు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులు తప్పక వ్యాక్సిన వేయించుకోవాలని కోరారు. 


యాడికి: మండలంలో సోమవారం నిర్వహించిన వ్యాక్సినేషన కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాధికారి ఆదినారాయణ పరిశీలించారు. ఆయన వెం ట తహసీల్దార్‌ అలెగ్జాండర్‌, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు. 


రాయదుర్గం రూరల్‌ : మండలంలోని ఆవులదట్ల పీహెచసీ పరిధిలో సోమవారం కరోనా వ్యాక్సిన వేసినట్లు డీడీవో వైద్యులు రమేష్‌ పేర్కొన్నా రు. ఆవులదట్ల, జుంజురాంపల్లి, రేకులకుంట, 74 ఉడేగోళం, నాగిరెడ్డిపల్లి  గ్రామాల్లో 1010 మందికి వ్యాక్సిన వేశామన్నారు. ప్రత్యేక వ్యాక్సిన డ్రైవ్‌ను పీఓడీ సుజాత, సీడీపీవో ప్రభావతమ్మ తనిఖీ చేశారు. 


శెట్టూరు: మండల వ్యాప్తంగా 16 గ్రామ పంచాయతీల్లో సోమవారం ని ర్వహించిన మెగా కొవిడ్‌ వ్యాక్సినేషనకు పెద్దఎత్తున స్పందన లభించిందని వైద్యాధికారి తెలిపారు. పెరుగుపాళ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి త హసీల్దార్‌ శంకయ్య, ఎంపీడీఓ వెంకటనాయుడు, ఎంఈఓ శ్రీధర్‌, ఏఎనఎం శిల్ప, సర్పంచు తిమ్మరాజు హాజరయ్యారు. 


తాడిపత్రి టౌన : పట్టణంలో సోమవారం 2800 మందికి కరోనా వ్యాక్సిన వేశామని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సచివాలయాల పరిధిలో వ్యాక్సిన అందించామని ఆయన తెలిపారు. 


ఉరవకొండ: స్వీయ జాగ్రత్తలతోనే కరోనా నివారణ సాధ్యమని తహసీల్దారు మునివేలు  పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా సోమవారం ప్రత్యేక వ్యాక్సినేషన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీలో వ్యాక్సినేషన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. 

Updated Date - 2021-07-27T06:23:08+05:30 IST