విద్యార్థులతో ఆటలు వద్దు

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

పాఠశాలలో ముందస్తు ఏర్పాట్లు లేకుండా యధావిధిగా కొనసాగించటం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమేనని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ తెలిపారు.

విద్యార్థులతో ఆటలు వద్దు

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 21 : పాఠశాలలో ముందస్తు ఏర్పాట్లు లేకుండా యధావిధిగా కొనసాగించటం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమేనని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ తెలిపారు. శుక్రవారం కడప నగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆరోగ్య విషయంలో తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా సెలవులు పొడిగించాలన్నారు.15 సంవత్సరాలలోపు వయసు పిల్లలకు వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి రాకుండా విద్యార్థులకు పాఠశాలలు నిర్వహించడం దుస్సాహసమే అవుతుందని చెప్పారు. కరోనా విషయంలో ప్రభుత్వం గణాంకాలు రోజు రోజుకూ పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ కడప పార్లమెంట్‌ కార్యదర్శి చవలముడి వినయ్‌, విశ్వనాద్‌, కడప నగర అధ్యక్షుడు అనిల్‌, ప్రధాన కార్యదర్శి అరుణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST