చేతులెత్తి దండం పెడతా.. హౌసింగ్‌లో అవినీతి వద్దు

ABN , First Publish Date - 2021-06-23T05:29:38+05:30 IST

ప్రతీ పేద కుటుంబం తలదాచుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అ ందజేస్తోందని, అలాంటి ఇళ్ల పంపిణీలో నిరుపేదలకు అన్యాయం జరిగితే ఎంతటి వారైనా పార్టీ నుంచి సస్పె ండ్‌ చేస్తానని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులను హెచ్చరించా రు.

చేతులెత్తి దండం పెడతా.. హౌసింగ్‌లో అవినీతి వద్దు
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సభాపతి పోచారం

కాంగ్రెస్‌ పార్టీ అందుకే భూస్థాపితమైంది
అలాంటి దుస్థితి వద్దు.. జైలుకు పోవద్దు!
లేదంటే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తా
టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరిక

వర్ని, జూన్‌ 22: ప్రతీ పేద కుటుంబం తలదాచుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అ ందజేస్తోందని, అలాంటి ఇళ్ల పంపిణీలో నిరుపేదలకు అన్యాయం జరిగితే ఎంతటి వారైనా పార్టీ నుంచి సస్పె ండ్‌ చేస్తానని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులను హెచ్చరించా రు. మంగళవారం వర్ని మండల కేంద్రంలో నియోజక వర్గంలోని వర్ని, చందూరు, మోస్రా, రుద్రూరు, కోటగి రి మండలాల ప్రజాప్రతినిధులతో ఆయన డబుల్‌ బె డ్‌రూం ఇళ్లు ఇతర సంక్షేమ పథకాలపై సమీక్షించారు. కొన్ని గ్రామాలలో కొంతమంది ప్రజాప్రతినిధులు త మ బంధువులకు, కుటుంబ సభ్యులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించినట్టు ఇంటలిజెన్స్‌ అధికారులు నివేదిక ఇచ్చారని సభాపతి పేర్కొన్నారు. ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అఽధికారంలో ఉండగా ఇంది రమ్మ ఇళ్ల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం దు ర్వినియోగం అయిందని, దాంతో 250 మంది అధికారు లు, నాయకులు జైలు పాలయ్యారని గుర్తు చేశారు. కో టగిరి మండలం కొత్తపల్లి గ్రామంలోనే 150 ఇళ్లతోపా టు జల్లాపల్లి, సుంకిని, హంగర్గఫారం గ్రామాలలో పు నాదులు తీయకుండానే బిల్లులు స్వాహా చేశారని గు ర్తుచేశారు. అలాంటి నాయకులను ప్రజలు చీ కొడతా రని, ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నానని, ఆ దుస్థితి టీఆర్‌ఎస్‌కు రావద్దని పిలుపునిచ్చారు. సమ న్వయం లేకుండా ఒంటెద్దుపోకగడతోపోయే నేతలు నాకు అవసరం లేదని, అందరినీకలుపుకొని, అర్హులైన నిరుపేదలకు లబ్ధిచేకూర్చే వారే నాకు గొప్ప నాయకు డని స్పీకర్‌ పేర్కొన్నారు. తప్పుడు విధానాలు తప్పుడు పనులను ప్రజలతోపాటు తానూ ఉపేక్షించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గానికి ఎక్కడా లేని విధంగా మరో 5వేల ఇళ్లు సీఎం కేసీఆర్‌ కృషితో మంజూరయ్యాయని, అర్హులందరికీ డబుల్‌ బె డ్‌రూం ఇళ్లు మంజూరు అవుతాయన్నారు.
ఎత్తిపోతల నిర్మాణాలకు నిధులు మంజూరు
నియోజకవర్గంలోని జాకోర, చందూరు, చింతకుం ట వద్ద పదివేల ఎకరాల నాన్‌కమాండ్‌ ఏరియాకు సా గునీటి సరఫరా కోసం 106.54 కోట్లతో ఎత్తిపోతల ని ర్మాణాలకు నిధులు మంజూరు అయినట్లు స్పీకర్‌ తెలి పారు. కాటివాడ, గాంధారి మీదుగా పైడిమల్‌ వద్ద సంపూర్ణంగా నాన్‌కమాండ్‌ ఏరియాలో సాగునీటి కో సం అర టీఎంసీ నీటి నిల్వతో చెరువును నిర్మించేందు కు రూ.72.52 కోట్లు మంజూరయ్యాయని, కాలువల కో సం మరో రూ.50కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి నట్లు స్పీకర్‌ తెలిపారు. కొడిచర్ల వద్ద లిప్టు నిర్మాణం కోసం రూ.30కోట్లు, బీర్కూర్‌కు రూ.25కోట్లు, బాన్సువా డకు రూ.25కోట్లు నిధులు మంజూరు అయినట్లు తెలి పారు. మెదక్‌ జిల్లా మీదుగా ఎల్లారెడ్డి రహదారిని జా తీయ రహదారిగా మార్చేందుకు రూ.250 కోట్లు మం జూరు కాగా.. బాన్సువాడ మీదుగా రుద్రూరు వరకు జాతీయ రహదారి కోసం రూ.300 కోట్లు మంజూరైన ట్టు ఆయన తెలిపారు. బోధన్‌ మీదుగా బాసర వరకు జాతీయ రహదారి పనులు కొనసాగుతాయన్నారు.
25 నుంచి నిజాంసాగర్‌ నీటి విడుదల
ఈనెల 25 నుంచి నిజాంసాగర్‌ నీటిని విడుదల చే యనున్నట్లు స్పీకర్‌ పోచారం తెలిపారు. సమీక్ష సమా వేశంలో నేతల అభిప్రాయాలను తీసుకొని ఆయకట్టు రైతులకు నీరందించనున్నట్టు తెలిపారు. గుంట గుం టకు సాగునీరు అందుతుందన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాజేశ్వర్‌, హౌసింగ్‌ ఏఈ నాగేశ్వర్‌రావు, పీఆర్‌ ఈఈ రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇ న్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీలు గుత్ప భా స్కర్‌రెడ్డి, హరిదాస్‌, నారోజి గంగారం, శంకర్‌పటేల్‌, ఎంపీపీలు పిట్ల ఉమశ్రీరాం, వల్లెపల్లి సునీత శ్రీనివాస్‌ రావు, సుజాత నాగేందర్‌, ఏఎంసీ చైర్మన్‌లు సంజీవ్‌, గంగాధర్‌, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎం పీటీసీలు, హౌసింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:29:38+05:30 IST