కొవిడ్‌ బాధితుల వద్దకు అటెండెంట్లు వద్దు

ABN , First Publish Date - 2021-05-12T07:12:13+05:30 IST

‘ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితుల వద్దకు వారి అటెండెంట్లు వెళ్లడం మంచిది కాదు.

కొవిడ్‌ బాధితుల వద్దకు అటెండెంట్లు వద్దు

ఆరోగ్య వివరాల వెల్లడికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలన్న ఎస్వో 


తిరుపతి, మే11 (ఆంధ్రజ్యోతి): ‘ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితుల వద్దకు వారి అటెండెంట్లు వెళ్లడం మంచిది కాదు. వారివల్ల కొవిడ్‌ వ్యాప్తికి అవకాశం కల్పించినట్లు అవుతుంది’ అని కొవిడ్‌-19 స్పెషలాఫీ సరు రామ్‌గోపాల్‌ తెలిపారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఆయన జేసీ(హెల్త్‌)వీరబ్రహ్మం, ఆర్డీవో కనకనరసారెడ్డితో సమావేశమయ్యా రు. బాధితుల పరిస్థితి వారి బంధువులకు తెలపడానికి వలంటీర్లలాగా ప్రత్యే క సిబ్బందిని నియమించే ఏర్పాట్లను పరిశీలించాలన్నారు.లాక్‌డౌన్‌ కారణంగా ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌ పోస్టుల వద్ద ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఆలస్యం కాకుండా అనుమతించే ఏర్పాట్లు చేయాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. కొవిడ్‌ టెస్టింగ్‌ వేగవంతం చేయాలన్నారు. ఫీవర్‌ సర్వేలో లక్షణాలు ఉన్నవారిని గుర్తించి టెస్టులు చేస్తున్నామని జేసీ వీరబ్రహ్మం తెలిపారు. 

Updated Date - 2021-05-12T07:12:13+05:30 IST