అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దు

ABN , First Publish Date - 2022-05-27T04:56:03+05:30 IST

హార్సిలీహిల్స్‌లో టౌన్‌ షిప్‌ కమిటీ అనుమతు లు లేకుండా ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని మదనపల్లె ఆర్డీవో మురళి అధికారులను ఆదేశించారు.

అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దు
హార్సిలీహిల్స్‌లో పర్యటిస్తున్న ఆర్డీవో మురళి

హార్సిలీహిల్స్‌కు సరికొత్త అందాలు  పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక  మదనపల్లె ఆర్డీవో మురళి

బి.కొత్తకోట మే 26 : హార్సిలీహిల్స్‌లో టౌన్‌ షిప్‌ కమిటీ అనుమతు లు లేకుండా ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని మదనపల్లె ఆర్డీవో మురళి అధికారులను ఆదేశించారు. హార్సిలీహి ల్స్‌లో జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం రోడ్లపై నెలకొన్న అక్రమణల ను నాలుగు రోజులుగా అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో మురళి గురువారం హార్సిలీహిల్స్‌లో పర్యటించి అక్రమణలు తొలగించిన తరువాత విశాలమైన రోడ్లను పరిశీలించారు. టూరి జం పంక్షన్‌ హాల్‌లో హార్సిలీహిల్స్‌ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ నెలలో జరిగిన రెండు సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలలో ఇప్పటి వరకు అమలు చేసినవి, ఇంకా అమలు చేయాల్సిన వాటిపై సమీక్షించారు. హిల్స్‌ సమగ్ర అభివృద్ధికి సూచిం చిన అభివృద్ధి పనులకు సంబంధిత శాఖ అధికారులందరు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా హార్సిలీహిల్స్‌కు వచ్చే పర్యాటకులను ఆకట్టుకునే విధంగా గార్డెన్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని పచ్చని చెట్లతో స్వాగత తోరణాలను అభివృద్ధి పరచి పరిశుభ్రత పాటించడం ప్లాస్టిక్‌ను నిషేధించడం ద్వారా కొండకు సరి కొత్త శోభ తీసుకురావాలని  సూచించారు. హిల్స్‌పై పర్యాటకుల వాహ నాలకు ప్రత్యేక పార్కింగ్‌  గాలిబండ సమీపంలో ఉన్న స్థలంలో ఏర్పా టు చేయడానికి నిర్ణయించారు. పగటి వేళ ద్విచక్ర వాహనాలకు రూ.10, కార్లు, తదితర నాలుగు చక్రాల వాహ నాలకు రూ.25 నిర్ణయించారు. రాత్రి వేళ కూడా పార్కింగ్‌కు అయితే  ద్విచక్రవాహనాలకు రూ.20, నాలుగు చక్రాల వాహనాలకు 50 రూపా యలుగా నిర్ణయించారు మరో రెండు ఆర్వో వాటర్‌ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొల గింపులో బంకులను తొలగించిన వారిలో నిజంగా జీవనోపాధి కోల్పోయే వారికి అద్దెకు స్థలా లను కేటాయిస్తామని తెలిపారు. ఘాట్‌ రోడ్డులో, కొండపైన డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొండ పైకి ప్రతిరోజు అదనంగా ఆర్టీసీ బస్సు ప్రత్యేక సర్వీస్‌లను కొనసాగించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో మదనపల్లె డీఎల్పీవో లక్ష్మీ, రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌, బి.కొత్తకోట తహసీల్దార్‌ దనంజయులు, ఎస్‌ఐ రామ్మోహన్‌, ఆర్‌ఐలు శ్రీనివాసులు, వీఆర్వో ఖాదర్‌బాష, అమరనారాయ ణ, సర్వేయర్‌ శ్రీ వాణి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.    

Updated Date - 2022-05-27T04:56:03+05:30 IST