Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దు

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

పోచంపల్లి భూమిలో బోర్డు ఏర్పాటు 

తాండూర్‌, అక్టోబరు 21: మాదారం పంచాయతీ పరిధి లోని పోచంపల్లి భూములు సీలింగ్‌ చట్టం కిందకు వస్తా యని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. పోచంపల్లిలోని సర్వే నెంబరు 15లో సింగరేణిలో ప్రతిపాదిత ఉపరితల గని కింద ముంపు పరిహారం కోసం పదుల సంఖ్యలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన విషయంపై ఆంధ్రజ్యోతిలో ‘పరిహారం గూళ్లు’ శీర్శికతో ఈనెల 20న కథనం ప్రచురితమైంది. రెవెన్యూ అధికారులు స్పందించి బుధవారం నిర్మాణా లను పరిశీలించారు.  గురువారం ఈ భూమి సీలింగ్‌ పరిధి కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఎమ్మార్వో కవిత ఆదేశాల మేరకు ఆర్‌ఐ ఎజాజొద్దీన్‌ ఆధ్వర్యంలో సిబ్బంది హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ భూమి  అమ్మడానికి వీలు లేదని గ్రామస్థులకు తెలిపారు. నిర్మాణాలు చేపట్టవద్దని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement