ఫ్లైఓవర్‌తో మా బతుకులు తీయొద్దు

ABN , First Publish Date - 2021-01-26T05:44:09+05:30 IST

జాతీయ రహదారిని ఆనుకున్న ఎన్నో కుటుంబా లు జీవనోపాధి పొందుతున్నారని, ఫ్లై ఓవర్‌ పేరుతో మా బతుకులు తీయొద్దని రణస్థ లం వ్యాపారులు జేసీ సుమిత్‌కుమార్‌ను వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం జేఆర్‌పురంలో వ్యాపారులంతా బంద్‌ పాటించి, హైవేపై మానవహారంగా నిలబడి నిరసన తెలిపారు.

ఫ్లైఓవర్‌తో మా బతుకులు తీయొద్దు
జేసీకి వినతి పత్రం అందిస్తున్న వ్యాపారులు

జేసీకి మొరపెట్టుకున్న రణస్థలం వ్యాపారులు

రణస్థలం : జాతీయ రహదారిని ఆనుకున్న ఎన్నో కుటుంబా లు జీవనోపాధి పొందుతున్నారని, ఫ్లై ఓవర్‌ పేరుతో మా బతుకులు తీయొద్దని రణస్థ లం వ్యాపారులు జేసీ సుమిత్‌కుమార్‌ను వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం జేఆర్‌పురంలో వ్యాపారులంతా బంద్‌ పాటించి, హైవేపై మానవహారంగా నిలబడి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి జేసీ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందిం చారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఇక్కడ వ్యాపారం చేసుకుని బతుకుతున్నామని, ఇప్పుడు ఫ్లై ఓవర్‌ నిర్మిస్తే ఆర్థికంగా నష్టపోతామని అన్నారు. దన్నానపేట హైవే నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు ఉన్నాయని, గజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసినట్టు గుర్తు చేశారు. వీరికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, హెచ్‌ఆర్‌డీ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు మద్దతు తెలిపారు.  కార్యక్రమంలో దెయ్యం శ్రీనివాసరావు, బలివాడ శ్రీనివాసరావు, ఇడదాసుల తిరుపతిరాజు, డి.రామారావు,  పిన్నింటి సత్యంనాయుడు,  తదితరులు పాల్గొన్నారు. కాగా జేఆర్‌పురంలో ఫ్లై ఓవర్‌ వద్దని, గతంలో గుర్తించిన విధంగా బైపాస్‌ ఏర్పాటు చేయాలని హెచ్‌ఆర్‌డీ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు విశాఖలో హైవే పీడీ శివశంకర్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2021-01-26T05:44:09+05:30 IST