వీఆర్వోలను భూసంబంధ విధుల్లోకి తీసుకోవద్దు

ABN , First Publish Date - 2021-01-21T06:17:51+05:30 IST

ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ప్రకారం వీఆర్వోలను భూసంబంధిత విధుల్లోకి తీసుకోవద్దని టీఎన్‌జీవో్‌స జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రవణ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

వీఆర్వోలను భూసంబంధ విధుల్లోకి తీసుకోవద్దు
కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు

నల్లగొండ టౌన్‌, జనవరి 20 : ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ప్రకారం వీఆర్వోలను భూసంబంధిత విధుల్లోకి తీసుకోవద్దని టీఎన్‌జీవో్‌స జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రవణ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటీల్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీఆర్‌వోలు నాలుగు నెలలుగా భూ సంబంధిత వి ధులు నిర్వర్తించడం లేదన్నారు. వెంటనే వీఆర్వోల సర్వీసు, సీనియార్టీకి ఇబ్బంది కలగకుండా పదన్నోతులు కల్పిస్తూ ఆయా శాఖల్లోకి తీసుకోవాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పగిళ్ల యాదయ్య మా ట్లాడుతూ తహసీల్దార్లందరూ భూ సంబంధిత పనులు చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తుండడంతో ఫలితంగా వీఆర్‌వోలు మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. మాతృత్వ శాఖ రెవెన్యలోనే రీలొకేట్‌ చేయాలన్నారు. వయోభారం పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వీఆర్‌ఎస్‌ అవకాశం కల్పించి కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలన్నారు. ఐదు నుంచి 12ఏళ్లు పూర్తి చేసుకున్న వీఆర్‌వోలకు స్పెష ల్‌ గ్రేడ్‌ ఇంక్రిమొంట్లు మంజూరు చేయాలన్నారు. అర్హులుగా ఉన్న వీఆర్వోలకు సర్వే ట్రైనింగ్‌ ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేట్‌ జిల్లా అఽధ్యక్షుడు జిల్లా వెంకటేశం, కోశాదికారి ఎండీ.ముబిన్‌ అహ్మద్‌, జిల్లా కార్యదర్శి ఎండీ.నజీర్‌, నాయకులు రంగరాజు శ్రీనివాసులు, కుర్మేటీ జస్టిస్‌, షేక్‌ హైమద్‌, మురళి, మణిమాల, మహేందర్‌, యాదగిరి, రామస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:17:51+05:30 IST